తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు! తెలంగాణలో సమ్మిళిత అభివృద్ధి జరుగుతోందని కేటీఆర్ అన్నారు. ఒక్క కేసీఆర్‌ను ఓడించేందుకు అందరూ ఏకమవుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మీదకు కాంగ్రెస్, బీజేపీ దండులా వస్తున్నాయని.. కేసీఆర్ సింహంలాంటోడు, సింగల్‌గానే వస్తాడని కేటీఆర్ పేర్కొన్నారు. By V.J Reddy 04 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి ఇవాళ జలవిహార్‌లో న్యాయవాదులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో మంత్రి కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిలో తెలంగాణ ముందు వరుసలో నిలిచిందని... 2014కు ముందు.. తర్వాత తెలంగాణ పరిస్థితులను ప్రజలు గమనించాలని అన్నారు. అక్టోబర్ 25న పాక్స్‌కాన్ కంపెనీకి కాంగ్రెస్(Congress) నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) లేఖ రాశారని అన్నారు. హైదరాబాద్‌లో పెడుతున్న పాక్స్‌కాన్ ఫ్యాక్టరీని బెంగళూరుకు తరలించాలని లేఖలో వారు కోరినట్లు కేటీఆర్ తెలిపారు. Also Read: AI వాడకంపై కొత్త రూల్స్.. కేంద్ర మంత్రి సంచలన ప్రకటన! త్వరలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోందని.. పరిశ్రమలన్నీ బెంగళూరుకు తరలుతాయని లేఖలో శివకుమార్ పేర్కొన్నట్లు కేటీఆర్ వెల్లడించారు. కేసీఆర్ సీఎం కాకపోతే తెలంగాణలో ఏం జరగబోతుందో చెప్పేందుకు డీకే శివకుమార్ లేఖ ఒక ఉదాహరణ మాత్రమే అని తెలిపారు. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తే మాత్రం అన్నీ పరిశ్రమలు కర్ణాటకకు పోతాయని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి విపక్షాలకు కనిపించడం లేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు మంత్రి కేటీఆర్. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 70 లక్షల మందికి రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బీమా లాంటి పథకాలను ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.10లక్షల కోట్లకు చేరుకున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత 24వేల కొత్త పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయి. దీని ద్వారా లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. ఈసారి కేసీఆర్ సీఎం కాకపోతే తెలంగాణ పరిస్థితి అధోగతి పాలవుతుందని పేర్కొన్నారు. Also Read: ఖమ్మంలో సాండ్ మాఫియా నడుస్తోంది.. పువ్వాడపై తుమ్మల విమర్శలు తెలంగాణలో సమ్మిళిత అభివృద్ధి జరుగుతోందని.. ఒక్క కేసీఆర్‌ను ఓడించేందుకు అందరూ ఏకమవుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ మీదకు కాంగ్రెస్, బీజేపీ దండులా వస్తున్నాయని.. కేసీఆర్ సింహంలాంటోడు, సింగల్‌గానే వస్తాడని అన్నారు. ఎవరు ఎన్ని చేసిన ఈసారి అధికారంలోకి బీఆర్‌ఎస్ రావడం ఖాయం.. కేసీఆర్ మరోసారి సీఎం అవ్వడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. #ktr #congress #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి