గాంధీభవన్‌లో ఓ వైపు కోలాహలం.. మరోవైపు అసమ్మతి గళం

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎన్నికల హడావిడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దీంతో గాంధీభవన్‌ సందడిగా మారింది. మరోవైపు నియోజకవర్గాల్లో అసమ్మతి గళం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ అత్యవసరంగా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పాటుచేసింది.

New Update
గాంధీభవన్‌లో ఓ వైపు కోలాహలం.. మరోవైపు అసమ్మతి గళం

టీపీసీసీ అత్యవసర సమావేశం.. 

ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించండంతో గాంధీభవన్‌ కోలాహలంగా మారింది. మరోవైపు నియోజకవర్గాల్లో అసమ్మతి గళం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన అత్యవసరంగా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతో పాటు ఇంచార్జ్ ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నాయకులు పాల్గొంటారు. చేవెళ్ల బహిరంగ సభ, గద్వాల్‌ సభలపై చర్చించనున్నారు. అలాగే తిరగబడదాం-తరిమికొడదాం కార్యక్రమం, అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణపై చర్చ జరగనుంది. అలాగే నియోజకవర్గ నాయకుల మధ్య నెలకొన్న వివాదాలకు ఫుల్‌స్టాప్ పెట్టే విధంగా కార్యాచరణ రూపొందించనున్నారు.

ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవాల్సిందే..

ఆగస్ట్‌ 25వరకు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తులను వడబోసి, స్క్రీనింగ్‌ కమిటీకి పంపుతారు. కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ .. అభ్యర్ధులని ఫైనల్‌ చేస్తుంది. ఒకవేళ అక్కడ కూడా అభ్యర్ధి ఎంపిక తేలకపోతే అంతిమంగా సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీలో ఎంత పెద్ద నాయకుడు అయినా సరే కాంగ్రెస్‌ తరపున పోటీ చేయాలనుకుంటే మాత్రం దరఖాస్తు చేసుకోవాల్సిందేనని రేవంత్ రెడ్డి తెలిపారు. పీసీసీ అధ్యక్షుడైనా, సీఎల్పీ నేత అయినా సరే దరఖాస్తు చేసుకోవాల్సిందేనన్నారు. తాము సీనియర్లమని, అనుభవం ఉందని ఎవరికి వాళ్లు టికెట్లను ప్రకటించుకుంటే కుదరదని తేల్చిచెప్పేశారు.

నియోజకవర్గాల్లో నిరసన గళం..

మరోవైపు నియోజకవర్గాల్లో నిరసన గళం వినిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్నవేళ.. విభేదాలు పార్టీని గందరగోళానికి గురిచేస్తోంది. పొంగులేటి చేరికతో పాటు ఖమ్మం సభ గ్రాండ్‌ సక్సెస్‌ కావడం.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వంటి సీనియర్ నేతలు పార్టీలో చేరడం చూసి ఫుల్ జోష్‌లో ఉన్నారు కార్యకర్తలు. అయితే పొంగులేటి, జూపల్లి చేరికపై స్థానిక నాయకుల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. మునుగోడు కాంగ్రెస్‌ నేతలు ఏకంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ఎదుటే ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. మరి దరఖాస్తుల ప్రక్రియ పూర్తై అభ్యర్థుల ఎంపిక ఫైనల్ చేసే నాటికి ఇంకెంత రచ్చ జరుగుతుందనే ఆందోళన నెలకొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు