Telangana Congress: కాంగ్రెస్ విజయం తథ్యం.. ఇదే మా ఆయుధం అంటూ సంచలన విషయాలు చెప్పిన భట్టి..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతగా, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నో విశిష్ట సేవలందించారు. మధిర నుంచి మూడు సార్లు విజయఢంకా మోగించి హ్యాట్రిక్ కొట్టిన భట్టి విక్రమార్క.. మరోసారి తాను విజయం సాధించడమే కాకుండా.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. తెలంగాణలో ఎన్నికల వేళ ఆర్టీవీకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.. ఆ ఇంటర్వ్యూ ఇక్కడ చూడండి..

New Update
Telangana Congress: కాంగ్రెస్ విజయం తథ్యం.. ఇదే మా ఆయుధం అంటూ సంచలన విషయాలు చెప్పిన భట్టి..

Telangana Elections: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతగా, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నో విశిష్ట సేవలందించారు. ఆయన మరెవరో కాదు.. మధిర నుంచి మూడు సార్లు విజయఢంకా మోగించి హ్యాట్రిక్ కొట్టిన భట్టి విక్రమార్క(Bhatti Vikramarka). మరోసారి తాను విజయం సాధించడమే కాకుండా.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు దాదాపు 1300 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఏం చేస్తామనేది ప్రజలకు వివరించారు. అధికార పార్టీ తప్పులను ఎత్తి చూపారు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈసారి కాంగ్రెస్‌దే విజయం అని ఘంటాపథంగా చెప్పారు. 74 నుంచి 78 సీట్లు గెలిచి.. ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు, తదితర అంశాలపై ఆర్టీవతో ప్రత్యేకంగా మాట్లాడారు భట్టి విక్రమార్క. మరి ఆయన ఏం మాట్లాడారు? కాంగ్రెస్ వ్యూహమేంటి? కాంగ్రెస్‌లో ఎవరు చేరబోతున్నారు? ఈసారి విజయం తథ్యమేనా? ప్రత్యేక కథనం మీకోసం..

భట్టి విక్రమా ఇంటర్వూలో ఏమన్నారో యధావిధంగా..

'రాజకీయాల్లో అలసట ఉండదు.. జోష్ మాత్రమే ఉంటుంది. నిత్యం ఉత్సాహంతో ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాం. కాంగ్రెస్ పార్టీలో, పార్టీ గుర్తుపై పోటీ చేయడం సంతోషంగా ఉంది. 18 సంవత్సరాలు కష్టపడితే ఆ సింబల్‌పై పోటీ చేసే అదృష్టం నాకు దక్కింది. కష్టపడి పని చేస్తే అందరికీ అవకాశం లభిస్తుంది. పొన్నాల లక్ష్మయ్యపై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌ గురించి నాకు తెలియదు. ఆ కామెంట్స్ విన్న తరువాత స్పందిస్తాను. పార్టీలో చేరికలు ఎప్పుడూ బలాన్నే ఇస్తాయి. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారందరూ పార్టీ అధికారంలోకి రావాలనే కోరుకుంటారు. అయితే, అందరికీ సీటు దక్కే అవకాశం ఉండకపోవచ్చు.'

ఇదికూడా చదవండి: సుప్రీంకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా

'మూడవసారి కేసీఆర్‌ను నమ్మడానికి తెలంగాణ ప్రజలలు సిద్ధంగా లేరు. ఈసారి కాంగ్రెస్ పార్టీ వైపే తెలంగాణ ప్రజలు ఉన్నారు. ప్రజల్లో కాంగ్రెస్‌పై నమ్మకం ఉంది. ఈసారి కాంగ్రెస్ గెలుస్తుంది. ప్రజల సంపదను ప్రజలకు పంచాంలంటే కాంగ్రెస్ రావాల్సిందే. అందుకే కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పథకాలు కాపీ కొట్టామని అంటున్నారు.. మేము ఎవరి పతకాలు కాపీ కొట్టలేదు. మా పథకాలే కాపీ కొట్టారు. ఉచిత కరెంట్ మా పేటెంట్, మా ప్రభుత్వం ఇచ్చింది. ఆరోగ్య శ్రీ కార్డును మా ప్రభుత్వం ఇచ్చింది. పెన్షన్స్ ఇచ్చింది మేము. ఏ పథకాన్ని మేము కాపీ కొట్టలేదు. కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడటం తప్ప ఆయన కొత్తగా చేసిందేమీ లేదు. హౌసింగ్ కార్పొరేషన్ ద్వార ఇందిరమ్మ ఇళ్లను ఇస్తే.. కేసీఆర్ ఆ హౌసింగ్ కార్పొరేషన్‌ను ఎత్తేశారు. రేషన్ కార్డు కింద తమ ప్రభుత్వంలో 9 రకాల సరకులు ఇస్తే.. ఇప్పుడు అన్నీ ఎత్తేసి ఒక్క బియ్యం మాత్రమే ఇస్తున్నారు. అసలు రేషన్ కార్డులు కూడా ఇవ్వడం లేదు.' అన్నారు.

'నాడు మా ప్రభుత్వం పెన్షన్ ఇద్దరికి ఇస్తే.. కేసీఆర్ ప్రభుత్వం కుటుంబంలో ఒకరికి కోత పెట్టి ఒకరికి మాత్రమే ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో యువతుల పెళ్లి కోసం బంగారు తల్లి అని పథకం పెట్టి రూ. 2.60 లక్ష అందించే విధంగా పథకం ఉంటే.. కేసీఆర్ మాత్రం కల్యాణ లక్ష్మి పేరుతో రూ. లక్ష కోసేసి ఒక లక్ష మాత్రమే ఇస్తున్నారు. దీన్ని బట్టి ఎవరు ఎవరి పథకాలు కాపీ కొడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. మేము అన్నీ సాధ్యమయ్యే హమీలను ఇచ్చాం. ఇప్పుడు అధికారంలోకి వస్తే.. చెప్పిన పథకాలన్నింటినీ అమలు చేస్తాం.' అని చెప్పారు భట్టి విక్రమార్క.

భట్టి విక్రమార్క ఇంటర్వ్యూ వీడియో..

సీట్ల ప్రకటన విషయంలో కీలక వ్యాఖ్యలు..

'సాధారణంగా అభ్యర్థల ప్రకటన.. ఎన్నికల నోటిఫికేషన్ నుంచి నామినేషన్ల సమయం వరకు ప్రకటించడం జరుగుతుంది. కానీ, ఇప్పుడు మేము ముందే ప్రకటిస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటకు పారిపోకుండా ఉండేందుకే భయంతో కేసీఆర్ ముందస్తుగా అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించారు. మాకు ఎలాంటి భయం లేదు. సమయం ప్రకారం అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటిస్తాం.' అని చెప్పారు.

వాళ్లు సీట్లు పంచుకునే లోపు.. మేము స్వీట్స్ పంచుకుంటామని కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై స్పందించిన భట్టి విక్రమార్క.. అవన్నీ వట్టి డైలాగ్స్ కొట్టిపారేశారు. పార్టీ సిద్ధాంతం, పార్టీ విధానాల ప్రకారం తమ నిర్ణయాలు తాము తీసుకుంటామన్నారు. పార్టీ పరంగానే ప్రచారం.. పార్టీ గుర్తు ప్రకారమే ప్రచారం ఉంటుందని స్పష్టంచేశారు. ఇక పార్టీలో చేరికలపై స్పందించిన భట్టి విక్రమార్క.. తెలంగాణ ఏర్పాటు తరువాత రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని, ఈ క్రమంలో ఎవరు ఏ పార్టీలో ఉన్నా.. ఏ పార్టీలోకి వచ్చినా అభ్యంతరం లేదన్నారు. టీడీపీ, బీజేపీ, బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల నుంచి కూడా కాంగ్రెస్‌లో వచ్చి చేరుతున్నారని తెలిపారు.

అప్పుడే ముఖ్యమంత్రి ప్రకటన..

ముఖ్యమంత్రి రేసులో ఉన్నారా? అన్న ప్రశ్నకు స్పందించిన భట్టి.. ఎన్నికలు జరిగి, గెలిచిన తరువాత కాంగ్రెస్ అభ్యర్థుల అభిప్రాయం తీసుకుని, దాని ప్రకారం ముఖ్యమంత్రిని అధిష్టాంన ప్రకటిస్తుందన్నారు. గెలుపుతో పాటు సామాజిక న్యాయం కూడా ముఖ్యమేనన్నారు. సీట్ల ప్రకటనలో సామాజిక న్యాయం అనేది అనుకున్న స్థాయికి చేరుతుందన్నారు. ఇక పొన్నాల పార్టీ మారడంపై స్పందించిన ఆయన.. పొన్నాల వెళ్లడం చాలా బాధాకరం అన్నారు. ఆయన సీనియర్ నాయకులని, పార్టీకి, తమకు ఇబ్బందికరం అన్నారు. స్వల్ప ఆవేశాలతో పార్టీలు మారడం సహజం అని, అవరమైతే ఆయనతో చర్చలు జరిపి తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తామన్నారు భట్టి విక్రమార్క.

రేవంత్‌తో విభేదాలు..

టీపీసీసీ చీఫ్ రేవంత్‌తో తనకెలాంటి విబేధాలు లేవని భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. కొందరు క్షణికావేశాలతో ఆరోపణలు చేస్తున్నారని, వాటిలో ఎలాంటి నిజాలు లేవన్నారు. ఇక ఉదయ్ పూర్ డిక్లరేషన్‌ను కాంగ్రెస్‌ను విస్మరించిందా? అని ప్రశించగా.. కొన్నిసార్లు, కొన్ని విషయాల్లో సర్దుబాట్లు ఉంటాయని.. ఇక్కడ అదే జరిగిందన్నారు. ఇంతకు ముందు నుంచే పార్టీలో యాక్టీవ్ గా ఉన్నవారికి ఈ డిక్లేషన్ విషయంలో ఒకటి రెండు ఎంగ్జెంప్షన్స్ ఉన్నాయన్నారు. వైఎస్ షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనం చేయడంపై స్పందించిన భట్టి.. ఇంకా చర్చలు జరుగుతుండొచ్చని అభిప్రాయపడ్డారు. రాజశేఖర్ రెడ్డి కూతురుగా షర్మిలను గౌరవిస్తామన్నారు. కమ్యూనిటీస్టులకు సీట్ల కేటాయింపుపై ఇంకా ఫైనల్ అవలేదన్నారు. ఇక ఖమ్మంలో గ్రూపు రాజకీయాలపై స్పందించిన భట్టి.. గ్రూపులు ఉన్నాయోమే కానీ, విభేదాలు అయితే లేవన్నారు.

ఆ రెండు పార్టీలు ఒక్కటే..

బీఆర్‌ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే అని వ్యాఖ్యానించారు భట్టి విక్రమార్క. బీఆర్ఎస్‌కు ఓటేస్తే.. బీజేపీకి ఓటు వేసినట్లేనని అన్నారు. విపక్ష నాయకులను లాగేందుకు బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నాయని అన్నారు. ఈ రెండు పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ధ్వసం చేస్తున్నాయన్నారు. ప్రతిపక్షమే లేకుండా చేయాలనేది వీరిద్దరి ఆలోచన అన్నారు. నియంతృత్వానికి నిదర్శనం బీఆర్ఎస్, బీజేపీ అని విమర్శించారు. జనరల్ సీట్లలో.. ఎస్సీలు కూడా పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ కల్పిస్తుందన్నారు. ఉచిత కరెంట్ మీద ఎవరికీ మాట్లాడే అర్హత లేదని, ఇది కాంగ్రెస్ పేటెంట్ అన్నారు. ఫ్రీ కరెంట్‌ను అమలు చేస్తామని స్పష్టం చేశారు. రేవంత్ మాటలను వక్రీకరించి ప్రచారం చేశారన్నారు. రేవంత్ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి.

ఇన్ని సీట్లలో తప్పక గెలుస్తాం..

కేసీఆర్ ఇచ్చే హామీలేవీ అమలు చేయరని ఆరోపించారు భట్టి విక్రమార్క. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చరన్నారు. ఎన్నికల సమయంలో హమీలను ఇవ్వడం, ఆ తరువాత మోసం చేయడం కేసీఆర్ నైజం అని వ్యాఖ్యానించారు భట్టి. కాంగ్రెస్ ఏం చేయగలదో.. అదే చెప్పాం.. అదే చేస్తామన్నారు. కాంగ్రెస్.. ప్రజలను సమానంగా చూస్తుందని, అభివృద్ధిని ప్రోత్సహిస్తుందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పై ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు. ఆ కారణంగా టికెట్ దక్కని వారు గాంధీ భవన్ కు వచ్చి.. నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈసారి ఎన్నికల్లో 74, 78 స్థానాలు గెలవబోతున్నాం అని ధీమా వ్యక్తం చేశారు భట్టి విక్రమార్క. ఖమ్మంలో కాంగ్రెస్ పదికి పది స్థానాలు గెలుస్తుందన్నారు. కాంగ్రెస్‌లోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని, కాంగ్రెస్ భావజాలంపై నమ్మకం ఉన్న వారే పార్టీలోకి వస్తారని చెప్పారు.

ధరణిలో సవరణలు..

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణిలో సవరణలు చేస్తామని చెప్పారు భట్టి విక్రమార్క. కేసీఆర్ ప్రభుత్వంలో ధరణి ద్వారా భూ కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. ధరణి విషయంలో చాలా తప్పులు ఉన్నాయని, దాంట్లో ఉన్న లొసుగులను సరి చేస్తామని చెప్పారు.

ఇదికూడా చదవండి: వరల్డ్‌కప్ ను పెద్దగా పట్టించుకోని జనాలు..కారణం ఇదేనా?

Advertisment
Advertisment
తాజా కథనాలు