Telangana Congress: కాంగ్రెస్ లో తారా స్థాయికి టికెట్ల పంచాయితీ.. గాంధీభవన్ వద్ద ఆదివాసీల మెరుపు ధర్నా!

ఈ రోజు గాంధీభవన్ వద్ద ఆదివాసీలు మెరుపు ధర్నాకు దిగారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అసిఫాబాద్ నుండి గాంధీభవన్ కు ఆదివాసీలు భారీగా చేరుకున్నారు. వారి సంప్రదాయం ప్రకారం డప్పులు, కొమ్ములు, డోలుతో స్లొగన్స్ ఇస్తూ గాంధీభవన్ మెట్లమీద ధర్నా చేశారు.

New Update
Telangana Congress: కాంగ్రెస్ లో తారా స్థాయికి టికెట్ల పంచాయితీ.. గాంధీభవన్ వద్ద ఆదివాసీల మెరుపు ధర్నా!

తెలంగాణ కాంగ్రెస్ లో (Telangana Congress) టికెట్ల పంచాయితీ తారా స్థాయికి చేరింది. బీసీ, మహిళా నేతలు తమ వారికి భారీగా టికెట్లను కేటాయించాలని ఆందోళన చేస్తుండగా.. తాజాగా ఆదివాసీలు సైతం ఆందోళనకు దిగారు. ఈ రోజు గాంధీభవన్ వద్ద ఆదివాసీలు మెరుపు ధర్నాకు దిగారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఆసిఫాబాద్ నుండి గాంధీభవన్ కు ఆదివాసీలు భారీగా చేరుకున్నారు. వారి సంప్రదాయం ప్రకారం డప్పులు, కొమ్ములు, డోలుతో స్లొగన్స్ చేస్తూ గాంధీభవన్ మెట్లమీద ధర్నా చేశారు. ఆసిఫాబాద్ టికెట్ ఆదివాసీలకు ఇవ్వాలని వాడు డిమాండ్ చేశారు. ఆదివాసీ బిడ్డ మరసుకొల్ల సరస్వతి కి కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వాల్సిందేన్నారు. అసిఫాబాద్ జనాభాలో లక్ష మంది మంది ఆదివాసీలు ఉన్నారన్నారు. ఆసిఫాబాద్ జనాభాలో లంబాడాలు 17 వేల మంది కూడా లేరన్నారు. ఆదివాసీల ఆందోళన నేపథ్యంలో ఆసిఫాబాద్ టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠగా మారింది.
ఇది కూడా చదవండి: TELANGANA ELECTIONS:సమరానికి రెడీ అయిపోయిన బీఆర్ఎస్…రంగంలోకి కేసీఆర్

ఓ వైపు ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా.. ఈ సారి తామే అధికారంలోకి వస్తున్నాం అని చెబుతున్న కాంగ్రెస్ పార్టీలో ఇంకా టికెట్ల పంచాయితీ తెగడం లేదు. టికెట్ల కోసం గాంధీభవన్ వద్ద నిత్యం వివాదాలు జరుగుతున్నాయి. వివిధ వర్గాల నేతలు తమకు టికెట్ ఇవ్వాల్సిందేనంటూ గాంధీభవన్ వద్దకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికే బీసీ నేతలు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలు, మహిళా నేతలు ఆందోళనలు చేస్తున్నారు.

టికెట్ల కేటాయింపులో తమకు తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనంటూ వారు పట్టుపడుతున్నారు. వీరందరికీ టికెట్లను అడ్జస్ట్ చేయడం కష్టమేన్న భావన కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. అయితే.. ఈ నేతలను ఎలా బుజ్జగించాలో తెలియన అగ్ర నేతలు తలలు పట్టుకుంటున్నారు. మరో వైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏకంగా తాను సూచిస్తున్న 15 మందికి టికెట్ ఇస్తే వారిని గెలిపించి అసెంబ్లీకి తీసుకువస్తానంటూహైకమాండ్ పెద్దలకు జాబితాను అందిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు