Telangana CM: సీఎం రేసులోకి దూసుకొచ్చిన దామోదర.. ఆయన ప్లస్ పాయింట్లు ఇవే! తెలంగాణ సీఎం పదవి రేసులోకి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా వచ్చారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రి, డిప్యూటీ సీఎంగా పని చేసిన తనకు అవకాశం కల్పించాలని ఆయన హైకమాండ్ ను కోరుతున్నట్లు సమాచారం. By Nikhil 05 Dec 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో 64 సీట్లతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ (Congress Party).. సీఎం అభ్యర్థి ప్రకటన విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేరును దాదాపు ఫైనల్ చేసిన తర్వాత కూడా సీనియర్లు బ్రేకులు వేస్తుండడంతో ప్రకటన ఆగిపోతున్నట్లు తెలుస్తోంది. సీనియర్లను ఒప్పించిన తర్వాతే సీఎం అభ్యర్థిని ప్రకటించాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క సీఎం రేసులో ముందు వరుసలో ఉంన్నారు. తాజాగా దామోదర రాజనర్సింహ కూడా సీఎం రేసులోకి వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల్ల్ చర్చ సాగుతోంది. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దామోదర కూడా తనను సీఎం చేయాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయన మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎంగానూ పని చేశారు. ఇది కూడా చదవండి: Revanth Reddy: రేవంత్‌ను సీఎం చేయొద్దు.. సీనియర్లు బలంగా వినిపిస్తున్న 5 వాదనలు ఇవే! వైఎస్, రోషయ్య సీఎంగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న దామోదర్.. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో డిప్యూటీ సీఎంగా పని చేశారు. పార్టీ వీరవిధేయుడిగా ఆయనకు పేరుంది. ఇటీవల అభ్యర్థుల ఎంపిక సమయంలో పటాన్ చెరు నుంచి నీలం మధు, నారాయణ ఖేడ్ నుంచి సురేష్ షెట్కార్ పేర్లను తొలుత ప్రకటించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దామోదర ఢిల్లీకి కూడా వెళ్లకుండా వారి పేర్లు మార్పించారు. తన అనుచరులైన కాటా శ్రీనివాస్ గౌడ్ కు పటాన్ చెరు, సంజీవరెడ్డికి నారాయణ ఖేడ్ టికెట్ ఇప్పించుకున్నారు. దీంతో హైకమాండ్ వద్ద ఆయనకు ఎంత పలుకుబడి ఉందో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ సొంత జిల్లా మెదక్ లోని అందోలు నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది కూడా దామోదర్ రాజనర్సింహకు ప్లస్ అయ్యే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఆసక్తిగా మారింది. #telangana-elections-2023 #telangana-congress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి