Sabitha Vs Revanth: సబిత అంటేనే మోసం.. మరోసారి రేవంత్ సంచలన కామెంట్స్! సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా రెడ్డి మధ్య మాటల తూటాలు ఆగడం లేదు. సబితారెడ్డి అంటేనే మోసం అంటూ మరో సారి సంచలన కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి. తనను ఎంపీగా పోటీ చేయమని చెప్పి.. నామినేషన్ వేసే సమయానికి పార్టీ మారిందని ఫైర్ అయ్యారు. By Nikhil 31 Jul 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి మోసం అనే పదానికి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యామ్నాయని మరో సారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ లాబీల్లో ఆయన ఈ రోజు మీడియాతో చిట్ చాట్ చేశారు. నన్ను కాంగ్రెస్‌లోకి రమ్మని, అక్క ఎందుకు బీఆర్ఎస్‌లోకి వెళ్లింది? అంటూ ప్రశ్నించారు. తనను మల్కాజ్ గిరి ఎంపీగా పోటీ చేయమని చెప్పి.. నామినేషన్ వేసే సమయానికి ఆమె బీఆర్ఎస్‌లోకి వెళ్లిందని ఫైర్ అయ్యారు. సబితపై వ్యక్తిగతంగా తనకు ఎలాంటి కోపం లేదన్నారు. ఆమె వ్యక్తిగతంగా మాట్లాడినందుకే తానూ మాట్లాడానన్నారు. 2018లో సునీత లక్ష్మారెడ్డి కోసం తాను నర్సాపూర్ ఎన్నికల ప్రచారానికి వెళ్లానన్నారు. ఇది కూడా చదవండి: Gadwal MLA: ఆ డిమాండ్‌కు నో చెప్పిన రేవంత్.. గద్వాల ఎమ్మెల్యే యూటర్న్‌కు కారణమిదే? ఆ సమయంలో తనపై రెండు కేసులు అయ్యాయని గుర్తు చేశారు. ఆ కేసుల చుట్టూ తాను ఇప్పటికీ తిరుగుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత సునీత పార్టీ మారి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ అయ్యారన్నారు. అనంతరం ఎమ్మెల్యే కూడా అయ్యారన్నారు. చిట్ చాట్ లో కేసీఆర్ పై రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్‌కు బాధ్యత లేదని ఫైర్ అయ్యారు. అధికారం ఉంటేనే కేసీఆర్ సభకు వస్తాడా? అని ప్రశ్నించారు. అతి చేస్తే శాసన సభ్యుల సభ్యత్వం కూడా స్పీకర్ రద్దు చేయొచ్చన్నారు. గతంలో కోమటిరెడ్డి, సంపత్ సభ్యత్వలను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నిన్న కూడా 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీ తాగిపోయారన్నారు. ఎవరినైనా కలవడం, మాట్లాడుకోవడం సహజమన్నారు రేవంత్ రెడ్డి. ఇది కూడా చదవండి: Sabitha Vs Revanth: మా కర్మకాలి అసెంబ్లీకి వచ్చాం.. కంటతడి పెట్టిన సబితారెడ్డి #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి