CM Revanth Reddy: సెమీ రెసిడెన్షియల్ పైలట్ ప్రాజెక్ట్ పై సీఎం సమీక్ష పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ లో సెమీ రెసిడెన్షియల్ పైలట్ ప్రాజెక్ట్ పై ఈ రోజు హరే రామ, హరే కృష్ణ ఫౌండేషన్ సభ్యులతో చర్చించారు. ఈ ప్రాజెక్ట్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు అధ్యయనం చేయాలన్నారు. By Nikhil 28 Jul 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి హరే రామ, హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. కొడంగల్ లో సెమీ రెసిడెన్షియల్ పైలట్ ప్రాజెక్ట్ పై చర్చించారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా నియోజకవర్గంలో ప్రతీరోజు 28వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించే ఏర్పాటు చేయనున్నారు. కొడంగల్ పట్టణంలో ఇప్పటికే సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ పనులను చేపట్టారు. హరేరామ,హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో సిఎం శ్రీ @revanth_anumula సమావేశం కొడంగల్ లో సెమీ రెసిడెన్షియల్ పైలట్ ప్రాజెక్ట్ పై చర్చ. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్,లంచ్ అందించే ఏర్పాటు. pic.twitter.com/Icqa4wGaoy — IPRDepartment (@IPRTelangana) July 28, 2024 ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ ను హరే రామ-హరేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్, సీఎస్ఆర్ ఫండ్స్ తో నిర్వహించనున్నారు. సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణం పూర్తయిన వెంటనే కొడంగల్ లో పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులకు సీఎం సూచించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని సీఎం ఈ సందర్భంగా వెల్లడించారు. ఇది కూడా చదవండి: Telangana: అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్-వద్దన్న ఓవైసీ #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి