ప్రముఖ తెలంగాణ కవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. నిన్న ప్రశ్నించే గొంతుకగా… నేడు ప్రజా పాలకుడిగా.. తనకు స్ఫూర్తి కాళోజీ అని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నారు.
CM Chandrababu: ఎమ్మెల్యే కొలికపూడికి షాకిచ్చన చంద్రబాబు.. వీడియో వైరల్!
తిరువూరు TDP ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కు సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఈ రోజు నందిగామ పర్యటనలో శ్రీనివాస్ ను పట్టించుకోలేదు. అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన వైపు సీరియస్ గా చూశారు. తిరువూరులో పరిణామాలపై టీడీపీ హైకమాండ్ ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే.
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌కు సీఎం చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చారు. నందిగామ పర్యటనలో కొలికపూడిని చంద్రబాబు పట్టించుకోలేదు. హెలికాప్టర్ దిగిన అనంతరం తనకు స్వాగతం పలకడానికి వచ్చిన ముఖ్యనేతలతో మాట్లాడారు. ఆ సమయంలో కొలికపూడి వైపు చంద్రబాబు సీరియస్ గా చూశారు. పార్టీ నేతలందరికీ షేక్‌హ్యాండ్ ఇచ్చి పక్కనే ఉన్న కొలికపూడిని పట్టించుకోలేదు. దీంతో కొలికపూడి వెనక్కి వెళ్లి నిలబడ్డారు.
వరుస వివాదాలతో హైకమాండ్ సీరియస్..
ఇటీవల తిరువూరు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై టీడీపీ హైకమాండ్ సీరియస్ గా ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యే కొలికపూడిని క్రమశిక్షణ కమిటీ పిలిచి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఆయన ఆయన తీరులో మార్పు కనిపించలేదు. స్థానిక టీడీపీ నేత రమేష్ రెడ్డితో ఆయన ఇటీవల కయ్యానికి దిగారు. రమేశ్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానంటూ ఏకంగా హైకమాండ్ కే కొలికపూడి అల్టిమేటమ్ ఇవ్వడం సంచలనంగా మారింది.