Telangana Job Calendar: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్ క్యాలెండర్ పై రేవంత్ కీలక ప్రకటన!

జాబ్ క్యాలెండర్ ను త్వరలోనే తీసుకువచ్చి నిర్దిష్టమైన గడువు లోపు ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ఫైర్ సర్వీసెస్ – సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో ఈ రోజు జరిగిన ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌ లో పాల్గొన్న సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

New Update
Telangana Job Calendar: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్ క్యాలెండర్ పై రేవంత్ కీలక ప్రకటన!

చట్టబద్దమైన జాబ్ క్యాలెండర్ ద్వారా ఏటా నిర్దిష్టమైన గడువులోపు ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తద్వారా నిరుద్యోగ యువకుల్లో విశ్వాసం కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. తెలంగాణ ఫైర్ సర్వీసెస్ – సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో ఈ రోజు జరిగిన ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌ లో సీఎం పాల్గొన్నారు. వారి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి ఏడాది తిరగక ముందే దాదాపు 60 వేల ఉద్యోగ నియామకాలు జరపడం ద్వారా యువత పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకుంటున్నామన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలను అందించామన్నారు.
ఇది కూడా చదవండి: Telangana: ఇంజినీరింగ్‌ చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌.. మరో 9 వేల సీట్లు

నియామక పత్రాలు అందుకున్న వారిలో 483 ఫైర్‌మెన్‌లు, 155 డ్రైవర్‌ ఆపరేటర్స్‌కు కూడా ఉండటం, వారిప్పుడు కఠిన శిక్షణ కూడా పూర్తి చేసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఏ ప్రమాదాలు జరిగినా ప్రాణాలకు తెగించి సామాజిక బాధ్యతగా భావించే ఈ ఉద్యోగంలో చేరడానికి ముందు కొచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున అభినందించారు. డీఎస్సీ, గ్రూప్ 1, 2, 3, లాంటి వివిధ శాఖల్లో ఖాళీలైన మరో 30 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపించాలన్నదే తమ ఆలోచనగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సహేతుకమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఎవరూ నిరసనలు, ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు శ్రీ పట్నం మహేందర్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, హోంశాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Street Dogs: మీ ఏరియాలో వీధి కుక్కల బెడద ఉందా?.. అయితే.. వెంటనే ఈ నంబర్ కు ఫోన్ చేయండి!


Advertisment
Advertisment
తాజా కథనాలు