సీఎం క్యాంప్ ఆఫీస్ మార్పు!.. MCRHRDకి తరలింపు తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీసు ప్రగతి భవన్ నుంచి మారబోతున్నది. అక్కడి నుంచి క్యాంప్ ఆఫీసును డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD) ప్రాంగణంలోకి రాబోతున్నది. By Naren Kumar 10 Dec 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి Pragati Bhavan - MCRHRD: తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీసు ప్రగతి భవన్(Pragathi Bhavan) నుంచి మారబోతున్నది. అక్కడి నుంచి క్యాంప్ ఆఫీసును డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD) ప్రాంగణంలోకి రాబోతున్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసుగా ఉన్న ప్రగతి భవన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌గా మార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం క్యాంప్ ఆఫీసును అక్కడి నుంచి MCRHRDకి తరలించాలని నిర్ణయించారు. ఇది కూడా చదవండి: కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్.. ఫొటోలు వైరల్.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదివారం స్వయంగా ఆ భవనాన్ని పరిశీలించారు. గుట్ట మీద ఎత్తుగా ఉన్న ప్రాంతంలో క్యాంప్ ఆఫీసు ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఆయన ప్రస్తుతం జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి పరిసరాల్లోని తన నివాసంలో ఉంటున్నారు. క్యాంప్ ఆఫీసు కూడా అక్కడికి దగ్గర్లోనే ఉంటుందని భావించి MCRHRD ప్రాంగణంలోకి తరలిస్తున్నారని తెలుస్తోంది. ఆ ప్రాంగణం దాదాపు 45 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందని అధికారులు చెప్తున్నారు. క్యాంప్ ఆఫీసు మార్పుపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇది కూడా చదవండి: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ సలహాదారుల నియామకాల రద్దు ఒకేసారి 150 మంది వరకూ కూర్చోగల సామర్థ్యంతో నాలుగు కాన్ఫరెన్స్ హాళ్ళు, పాలకమండలి సమావేశం కోసం బోర్డ్ రూమ్, 250 మంది కూర్చునేందుకు వీలుగా ఆడిటోరియంలతో పాటు మంజీర, కృష్ణ, గోదావరి, తుంగభద్ర పేర్లతో విడిగా బ్లాకులు కూడా అక్కడ ఉన్నాయి. #cm-revanth-reddy #cm-camp-office #pragathi-bhavan #mcrhrd మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి