Telangana Cabinet: ముగిసిన కేబినెట్ భేటీ.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

తెలంగాణ మంత్రివర్గం భేటీ ముగిసింది. దాదాపు రెండున్నర గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ భేటీలో రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. 16 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2008 DSC అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

New Update
TS Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్.. ఆ ఆంశాలపై చర్చించవద్దని కండిషన్స్!

Telangana Cabinet Meeting: తెలంగాణ మంత్రివర్గం భేటీ ముగిసింది. దాదాపు రెండున్నర గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ భేటీలో రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. 16 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2008 DSC అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 1,200 మంది డీఎస్సీ అభ్యర్థులకు కల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నెరవేరబోతోంది.

ALSO READ: కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన

రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు...

1. ముదిరాజ్ కార్పొరేషన్
2. యాదవ కురుమ కార్పొరేషన్
3. మున్నూరుకాపు కార్పొరేషన్
4. పద్మశాలి కార్పొరేషన్
5. పెరిక (పురగిరి క్షత్రియ) కార్పొరేషన్
6. లింగాయత్ కార్పొరేషన్
7. మేరా కార్పొరేషన్
8. గంగపుత్ర కార్పొరేషన్

ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (EBC)..

9. ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు
10. ఆర్య వైశ్య కార్పొరేషన్
11. రెడ్డి కార్పొరేషన్
12. మాదిగ, మాదిగ ఉప కులాల కార్పొరేషన్
13. మాల, మాల ఉప కులాల కార్పొరేషన్

మూడు ప్రత్యేక కార్పోరేషన్లు ఏర్పాటు..

* కొమురం భీమ్ ఆదివాసి కార్పోరేషన్
* సంత్ సేవాలాల్ లంబాడి కార్పోరేషన్
* ఏకలవ్య కార్పోరేషన
* ఆరోగ్య శ్రీరేషన్ కార్డుకు ఎలాంటి సంబంధం లేదు
* ఇకనుంచి రేషన్ కార్డు పూర్తిగా నిత్యావసర సరుకులకు మాత్రమే ఉపయోగపడుతుంది

* 2008 డీఏస్సీ అభ్యర్థులకు మినిమం పే స్కేల్ (టైం స్కెల్ ) ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయం
* వేసవిలో తాగునీటి కోసం ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకోవాలని అధికారులను ఆదేశించిన కేబినెట్
* గత ప్రభుత్వంలో జరిగిన ఇరిగేషన్ అవకతవకలపై విచారణ కోసం జస్టిస్ పినాకిని చంద్ర ఘోష్ తో కమిటీ.
* విధ్యుత్ రంగంలో అవకతవకలపై జస్టిస్ ఎల్. నర్సింహా రెడ్డి అధ్యక్షతన కమీటీ.
* 100 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశం.

Advertisment
Advertisment
తాజా కథనాలు