TG News: బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ కొణతం దిలీప్ అరెస్ట్! తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంఛార్జ్ కొణతం దిలీప్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే దిలీప్‌ను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. By srinivas 05 Sep 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి TG News: తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంఛార్జ్ కొణతం దిలీప్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే దిలీప్‌ను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. సభ్యత గురించి రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే, దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారిని నానా మాటలు అన్నది మీ రేవంత్ కాదా? ముందు మీ రేవంత్‌ను ముఖ్యమంత్రిలా వ్యవహరించమని చెప్పండి. మీ పార్టీ సోషల్ మీడియా జోకర్లకు తెలంగాణ కోసం… https://t.co/z3hD7WNmfN pic.twitter.com/4FRvldomIz — BRS Party (@BRSparty) September 5, 2024 ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కటమేనా ప్రజాపాలన.. కొణతం దిలీప్ అరెస్ట్ పై స్పందించిన కేటీఆర్.. పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. కొంతకాలంగా ప్రభుత్వ అసమర్థతను, చేతగానితనాన్ని దిలీప్ ప్రశ్నించడాన్ని రేవంత్ సర్కారు తట్టుకోలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితం కూడా తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించగా హైకోర్టు చీవాట్లు పెట్టినా, బుద్ధి రాలేదంటూ ఫైర్ అయ్యారు. ఎలాగైనా దిలీప్ గొంతు నొక్కాలన్న ఉద్దేశంతో మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని, కనీస సమాచారం కూడా ఇవ్వకుండా, ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో చెప్పకుండా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కటమేనా ప్రజాపాలన అంటే?అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో పాలన కొనసాగించవచ్చని అనుకుంటే అది మీ భ్రమే. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లు మరింత పుట్టుకొస్తారు. అక్రమంగా దిలీప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే ఆయనను విడుదల చేయాలి. 9 నెలలుగా తెలంగాణలో వాక్స్వాతంత్ర్యం లేదు. నిరంకుశ పాలన సాగుతోందన్నారు. 🛑తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ @KonathamDileep అక్రమ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS. ♦️ తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, తెలంగాణ వాది కొణతం దిలీప్‌ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. ♦️ కొంతకాలంగా ప్రభుత్వ అసమర్థతను,… pic.twitter.com/eapmrir8QN — BRS Party (@BRSparty) September 5, 2024 #konatham-dileep-arest #brs-social-media సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి