ఎంఐఎం నేత అసద్‌కు సవాల్ విసిరిన బోధన్ ఎమ్మెల్యే షకీల్!! బోధన్‌లో రాజకీయం హీటెక్కుతోంది. ఢీ అంటే ఢీ అంటున్నారు నేతలు. బోధన్‌లో అసుద్దీన్ వర్సెస్ ఎమ్మెల్యే షకీల్ కాంట్రవర్సీ కాకరేపుతోంది. ఎంఐఎం కౌన్సిలర్ల విషయంలో రాజుకున్న ఈ వివాదం కాస్త ఎంఐఎం - బీఆర్‌ఎస్‌ల మధ్య చిచ్చు పెడుతోంది. దమ్ముంటే నాపై పోటీచేయ్ అంటూ ఎంఐఎం చీఫ్ అసద్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ సవాల్ విసిరాడు ప్రస్తుతం ఈ సవాల్ కాస్త సంచలనంగా మారింది. By Shareef Pasha 30 Jun 2023 in రాజకీయాలు నిజామాబాద్ New Update షేర్ చేయండి ఎలక్షన్‌లకు ఇంకా సమయం ఉన్నా.. బోధన్‌లో మాత్రం రాజకీయం ఢీ అంటే ఢీ అన్నట్లుగా కొనసాగుతోంది. నిజామాబాద్‌లో పోటీపై త్వరలోనే స్పష్టత ఇస్తామని అసద్ తేల్చి చెపితే.. దమ్ముంటే బోధన్‌లో తనపై పోటీచేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే షకీల్ సవాల్ విసిరారు. అర్థరాత్రి హఠాత్తుగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బోధన్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఇలా అసద్‌ను టార్గెట్ చేయడం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అసదుద్దీన్ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారనీ.. తనపై హత్యాయత్నం చేసిన కౌన్సిలర్లపై పీడీ యాక్టు పెట్టాలనీ డిమాండ్ చేశారు. దమ్ముంటే అసదుద్దీన్ తనపై పోటీచేయాలంటూ బోధన్ ఎమ్మెల్యే షకీల్ సవాల్ విసిరారు. అనవసరమైన రాజకీయాలు చేయొద్దంటూ సూచించారు. యుద్ధం వెనకనుంచి కాదు,, ఎదురుగా చేయాలంటూ షకీల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే తనపై పోటీచేయాలంటూ అసద్‌కి సవాల్ విసిరిన షకీల్.. తుపాకీ తూటాలకు సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే తల్వార్‌లు సైతం తెచ్చుకోండంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.ఇద్దరి మధ్య ఈ స్థాయిలో గొడవకు ఇటీవల ఇద్దరు ఎంఐఎం కౌన్సిలర్ల అరెస్టే కారణం. ఇటీవల పట్టణ ప్రగతిలో భాగంగా వార్డుల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే షకీల్‌ను.. ఇద్దరు కౌన్సిలర్లు నిలదీశారు. తమ వార్డుల్లో అభివృద్ధి జరగడం లేదని.. వివక్ష చూపుతున్నారంటూ అసద్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బోధన్‌లోనూ ఎంఐఎం పోటీ చేస్తుందని స్పష్టంచేశారు. అయితే, ఈ సందర్భంగా ఉద్రిక్తత తలెత్తింది. తర్వాత కౌన్సెలర్లపై హత్యాయత్నంతో పాటు మరో మూడు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వారు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల జైల్లో ఉన్న ఆ ఎంఐఎం కౌన్సిలర్లను కలిసి రావడంతో వివాదం చినికి చినికి గాలివానగా మారింది. మరోవైపు తాజాగా, తమ కొడుకులను బోధన్ ఎమ్మెల్యే అన్యాయంగా జైల్లో పెట్టించారంటూ ఎంఐఎం కౌన్సిలర్లు తండ్రి అబ్దుల్ బాకీ మసీదులో ఖురాన్ ప్రమాణం నేపథ్యంలో బోధన్‌లో రాజకీయం ప్రకంపనలను రేపుతోంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి