తెలంగాణ సీఎంపై కేసు పెట్టిన ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భద్రాచలం పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫిర్యాదు చేశారు. సీఎం ఇచ్చిన హామీ ప్రకారం ఇండ్లు కట్టించి ఇవ్వలేదని, భద్రాచలం దేవాలయాన్ని అభివృద్ధి చేయలేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. భద్రాచలం నియోజకవర్గంలో సీతారామచంద్రస్వామికి కళ్యాణానికి మొదటిసారి వచ్చినప్పుడు రూ. 100 కోట్లతో రామాలయం అభివృద్ధి చేస్తానని చెప్పి మాట తప్పారని ఎమ్మెల్యే పొదెం వీరయ్య చెప్పారు.

New Update
తెలంగాణ సీఎంపై కేసు పెట్టిన ఎమ్మెల్యే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 2022 సంవత్సరంలో వరదలు సంభవించిన సమయంలో సీఎం కేసీఆర్ వచ్చారని, అప్పుడు వరదల కింద రూ. 1000 కోట్లు కేటాయించి.. వరద బాధితులకు పక్కా ఇండ్ల నిర్మించి ఇస్తామని, కరకట్ట ఎత్తును పొడిగిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. అయితే సంవత్సరం గడుస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు వంద రూపాయలు కూడా హామీలో భాగంగా ఇవ్వలేదని, ఉచిత హామీలతో తన నియోజకవర్గం ప్రజలను మోసం చేశారంటూ భద్రాచలం పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫిర్యాదు చేశారు.

telangana-breaking-news-congress-mla-podem-veeraiah-lodged-a-complaint-against-cm-kcr-at-bhadrachalam-police-station

ఉచిత హామీలతో నియోజకవర్గ ప్రజలను మోసం చేశారంటూ..

భద్రాచలం నియోజకవర్గంలోని ప్రజలకు, శ్రీ సీతారామచంద్ర స్వామికి ఇచ్చిన హామీలను సీఎం నెరవేర్చడం లేదని ఆరోపించారు. 2014లో మొదటిసారి స్వామి వారి కల్యాణానికి కేసీఆర్‌ వచ్చినప్పుడు రూ.100 కోట్లతో ఆలయ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. 2022లో వరదల సమయంలో రూ.1000 కోట్లు కేటాయించి వరద బాధితులకు పక్కా ఇళ్ల నిర్మాణాలు, కరకట్ట ఎత్తు పొడిగింపు చేస్తామని హామీ ఇచ్చి వెళ్లారని చెప్పారు. కానీ నేటి వరకు రూ.100 కూడా ఇవ్వలేదన్నారు. ప్రజలను, స్వామివారిని సైతం మోసం చేశారని మండిపడ్డారు.

సీఎం మాట తప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

హామీలు కేవలం మాటలకే తప్పా.. చేతలకు పని చెప్పలేదని పేర్కొన్నారు. భద్రాచలం అభివృద్ధికి నోచుకోలేదని పలు హామీలను సీఎం అమలు చేయకపోవడంతో పోలీసుల సహాయాన్ని కోరుతున్నామని ఎమ్మెల్యే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే రాజకీయంగా సంచలనంగా మారిన ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు మేరకు భద్రాచలం పోలీసులు కేసు నమోదు చేస్తారా? లేదా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. అంతేకాదు రాజకీయంగానూ తీవ్ర చర్చలకు దారి తీస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు