TS News: రేపటి నుంచి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే నిరాహార దీక్ష.. ఎందుకో తెలుసా? అందెవెల్లి పెద్దవాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందని సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు ఆరోపించారు. రేపు ఉదయం 9 గంటలలోగా అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోతే అదే బ్రిడ్జిపై నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు. By Nikhil 23 Jun 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం 9 గంటల నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగనున్నట్లు ప్రకటించారు. అందవెల్లి పెద్దవాగు బ్రిడ్జి పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. రేపు ఉదయం 9 గంటలలోగా అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోతే నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఈ బ్రిడ్జి మీదనే నిరాహార దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ కు సకాలంలో బిల్లు చెల్లించకపోవడంలో ఈ సమస్య ఉత్పన్నమైందన్నారు. ప్రజల కోసం బిజెపి...! కాగజ్ నగర్ మండలం లోని అందవెల్లి పెద్ద వాగు బ్రిడ్జి నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ ... సిర్పూర్ శాసనసభ్యులు శ్రీ పాల్వాయి హరీష్ బాబు గారు రేపు చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్షను దిగ్విజయం చేద్దాం. pic.twitter.com/9ea1pyOCQI — BJP Telangana (@BJP4Telangana) June 23, 2024 యుద్ధ ప్రాతిపదికన ఈ అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసి విడుదల చేశారు. రేపు ఉదయం 9 గం.లోగా ఈ అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోతే నిరవధిక నిరాహార దీక్షకు ఈ బ్రిడ్జి మీదనే కూర్చుంటానని హెచ్చరించారు. గత నెల రోజులుగా ఇన్చార్జి మంత్రి సీతక్కకు ఈ బ్రిడ్జి గురించి అనేక మార్లు తెలియజేశానన్నారు. అయినా ఈ సమస్యను పరిష్కరించడంలో వారు విఫలమయ్యారని విమర్శించారు. సోమవారం తాను చేపట్టబోయే నిరవధిక నిరాహార దీక్షకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని హరీష్ బాబు పిలుపునిచ్చారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి