Gajwel Constituency: పొలిటికల్ పార్టీలకు గజ్వేల్ వెరీ స్పెషల్.. ఆ సెంటిమెంటే కారణం..!

తెలంగాణలో అందరి దృష్టి ఇప్పుడు గజ్వేల్ పైనే ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా ఆయనపై పోటీ చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. ఇక గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే అయిన తూంకుంట నర్సారెడ్డి సైతం గట్టి పోటీ ఇస్తుండటంతో.. ఈసారి మరింత ఇంట్రస్ట్‌ క్రియేట్ అవుతోంది.

New Update
Gajwel Constituency: పొలిటికల్ పార్టీలకు గజ్వేల్ వెరీ స్పెషల్.. ఆ సెంటిమెంటే కారణం..!

Gajwel History: తెలంగాణలో పోలింగ్‌కు సరిగ్గా 29 రోజుల సమయం ఉంది. ఇప్పటికీ కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP)లు కొన్ని స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించనేలేదు. నేడో రేపో వారి పేర్లను కూడా ప్రకటించనున్నాయి. ఇక ప్రకటించిన చోట్లలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమదైన శైలిలో ప్రచారం చేస్తూ.. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఎవరి ప్రచారం ఎలా ఉన్నా.. ఏ నియోజకవర్గంలో పరిస్థితి ఏ రకంగా ఉన్నా.. అందరి ఫోకస్ మాత్రం ప్రత్యేకంగా గజ్వేల్‌(Gajwel)పైనే ఉంది. ఎందుకంటే.. ఇక్కడ పోటీ మరింత సరవత్తరంగా ఉండనుంది. ఈ నియోజకవర్గం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తుండగా.. ఆయన్ను ఓడించే లక్ష్యంతో బీఆర్ఎస్ బహిష్కృత నాయకుడు, మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పోటీకి దిగుతున్నారు. ఇక కాంగ్రెస్‌ నుంచి గతంలో గజ్వేల్‌ ఎమ్మెల్యేగా గెలిచిన తూంకుంట నర్సారెడ్డి కూడా బరిలో నిలుస్తున్నారు. దాంతో.. ఈసారి గజ్వేల్ నియోజకవర్గంలో పాలిటిక్స్ మరింత ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాయి.

రాజకీయ పార్టీల వారిగా పోటీ..

బీఆర్ఎస్..

అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ మూడవ సారి ఎమ్మెల్యేగా గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో తొలిసారి గజ్వేల్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల చంద్రశేఖ‌ర్‌రావు పోటీ చేశారు. ఆ తరువాత 2018లో జరిగిన ఎన్నికల్లోనూ ఆయన ఇక్కడి నుంచే పోటీ చేసి గెలుపొందారు. తన ప్రత్యర్థి అయిన ఒంటేరు ప్రతాప్ రెడ్డిపై 55 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడు మళ్లీ మూడోవసారి పోటీకి దిగుతున్నారు. అయితే, ఈసారి మాత్రం కేసీఆర్‌పై పోటీకి ఒకప్పటి తన సన్నిహితుడైన ఈటల రాజేందర్ దిగుతుండటం విశేషం. ఇదే ఇప్పుడు గజ్వేల్ పై ప్రజల దృష్టిని మళ్లించింది.

కాంగ్రెస్ పార్టీ..

కాంగ్రెస్ పార్టీ నుంచి గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికల బరిలో తూంకుంట నర్సారెడ్డి నిలుస్తున్నారు. ఈసారి గెలుపు తనదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న నర్సారెడ్డి.. గతంలో గజ్వేల్‌ ఎమ్మెల్యేగా గెలిచిన ట్రాక్ రికార్డ్ ఉంది. 2009లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన ఆయన.. నాటి టీడీపీ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డిపై గెలుపొందారు.

బీజేపీ..

బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గజ్వేల్‌ బరిలో నిలుస్తున్నారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌ను ఓడించి తీరుతానంటూ శపథం చేశారు. ఆ దిశగా ఆయన ప్రచారం కూడా చేస్తున్నారు. 2003లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన.. మొదట కమలాపూర్ నియోజకవర్గం, ఆ తరువాత హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి మొత్తం 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ఏర్పాటు తరువాత రాష్ట్ర మంత్రిగా రెండు పర్యాయాలు పని చేశారు. వివిధ కారణాల చేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. ఆ తరువాత ఈటల రాజేంరద్ బీఆర్ఎస్(నాటి టీఆర్ఎస్)పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఆ తరువాత వరుసగా జరిగిన పరిణామాలతో ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం, కేసీఆర్‌పై పోటీకి సై అనడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్.. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీకి దిగుతున్నారు.

త్రిముఖ పోరు..

గజ్వేల్‌లో తమకు పోటీ లేదని అధికార బీఆర్ఎస్ చెప్తున్నప్పటికీ.. ఈసారి మాత్రం టఫ్ ఫైట్ తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రత్యర్థులు ముగ్గురూ బలమైన వారు కావడమే ఇందుకు కారణం అని విశ్లేషిస్తున్నారు. మరి మునుపటి ఎన్నికల్లా ఈ ఎన్నిక కూడా కేసీఆర్‌కు నల్లేరుమీద నడకే అవుతుందా? లేక టఫ్ ఫైట్ అవుతుందా? అనేది తెలియాలంటే రిజల్ట్స్ డే వరకు ఎదురు చూడాల్సిందే.

తెలంగాణలో గజ్వేల్‌కు ప్రత్యేక స్థానం..

తెలంగాణలో గజ్వేల్ నియోజకవర్గానికి ప్రత్యేకత స్థానం ఉందని చెప్పుకోవచ్చు. ఎందరో ఉద్యమకారులకు, కవులు, కళాకారులకు జన్మనిచ్చిన ఈ గడ్డ.. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయంగా ఉంది. అందుకే గజ్వేల్‌ను మినీ ఇండియాగా అభివర్ణిస్తారు. ఇలాంటి ప్రాంతం కేసీఆర్‌ను 2014 ఎన్నికల్లో గెలిపించి తెలంగాణకు ముఖ్యమంత్రిగా అందించింది. అందుకే.. గజ్వేల్‌కు తెలంగాణలో ప్రత్యేక స్థానం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటారు. మరి ఈ సారి ఎవరిని గెలిపిస్తుందో చూడాలి.

పార్టీలకు సెంటిమెంట్..

గజ్వేల్‌ నియోజకవర్గంపై రాజకీయ పార్టీలకు ఒక సెంటిమెంట్ ఉంది. గత 13 ఎన్నికలను పరిశీలిస్తే.. గజ్వేల్‌లో ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అయినా.. తెలంగాణ ఏర్పాటు తరువాత అయినా.. ఇదే ట్రాక్ ఉంది. అందుకే.. ఈ సెంటిమెంట్ రాజకీయ పార్టీల్లో బలంగా పాతుకుపోయింది. ఈ గజ్వేల్ నియోజకవర్గానికి మరో స్పెషాలిటీ కూడా ఉంది. నియోజకవర్గం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు కూడా గజ్వేల్‌లో గెలిచిన వారంతా స్థానికేతరులే కావడం విశేషం. 1952లో ఎమ్మెల్యేగా గెలుపొందిన పెండెం సుదేవ్ నుంచి 2014లో గెలిచిన కేసీఆర్ వరకు కూడా అంతా స్థానికేతరులే.

గజ్వేల్ చరిత్ర..

1952లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఆ సమయంలో పెండెం వాసుదేవ్ ఎమ్మెల్యేగా గెలిచారు. 1957లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న సమయంలో జేబీ ముత్యాలరావు, ఆర్‌.నరసింహారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 1962లో నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ అయ్యింది. ఆ తరువాత 2009లో జ‌న‌ర‌ల్‌గా మారింది. పున‌ర్ విభ‌జ‌న‌లో ర‌ద్దయిన దొమ్మాట నియోజకవవ్గం నుంచి కొండ‌పాక మండ‌లం కొత్తగా గ‌జ్వేల్‌లో చేరింది. పూర్వం ఉన్న జ‌గ‌దేవ‌పూర్‌, ములుగు మండ‌లాలు య‌థాత‌థంగా ఉన్నాయి. తూప్రాన్ మండ‌లం పూర్తిగా చేరింది. గ‌జ్వేల్ మండ‌లంలోని రెండు గ్రామాలు అంత‌కు ముందు దొమ్మాట‌లో ఉండేవి. పున‌ర్ విభ‌జ‌న‌కు ముందు దొమ్మాట‌లో ఉన్న వ‌ర్గల్‌లోని 2 గ్రామాలు గ‌జ్వేల్‌లో క‌లిశాయి. దౌల్తాబాద్ మండ‌లంలోని 7 గ్రామాలు దొమ్మాట స్థానంలో ఏర్పడిన దుబ్బాక‌లో క‌లిశాయి.

నియోజకవర్గంలోని మండలాలు

గజ్వేల్

కొండపాక

గజ్వేల్

జగదేవ్‌పూర్

వర్గల్

ములుగు

Also Read:

బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా.. జనతా కా మూడ్ సర్వే లెక్కలివే..

సక్సెస్ జర్నీ అంటే ఇలా ఉండాలి కదా! దటీజ్ ‘గంగవ్వ’!

Advertisment
Advertisment
తాజా కథనాలు