BRSLP Meeting: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. ఆ 6గురు ఎమ్మెల్యేలు జంప్? కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ కు ఎమ్మెల్యేలు మాణిక్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, పద్మారావు గౌడ్, తలసాని, విజయుడు హాజరుకాకపోవడం చర్చనీయాశమైంది. ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరేందుకు సిద్ధం అవుతున్నారా? అన్న చర్చ సాగుతోంది. By Nikhil 23 Jul 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి ఫిరాయింపులతో బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే హస్తం పార్టీలోకి జంప్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తాజాగా కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. గైర్హాజరైన వారిలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఉన్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి కూడా బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ కు రాలేదు. దీంతో వీరంతా హస్తం గూటికి చేరేందుకు సిద్ధం అవుతున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బండారు లక్ష్మారెడ్డి మాత్రం జపాన్ పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణం చేతనే ఆయన బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ కు హాజరు కాలేదని సమాచారం. ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైనట్లు సమాచారం. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి