ఆరోగ్యశ్రీని.. అనారోగ్యశ్రీగా మార్చారంటూ సీఎం కేసీఆర్‌‌పై షర్మిల ఫైర్

తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకం అమలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీరుపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనదైనా శైలీలో తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు. సంజీవనిలా పనికొచ్చే ఆరోగ్యశ్రీని కోమాలో పెట్టి అనారోగ్యశ్రీగా మార్చారని షర్మిల దుయ్యబట్టారు. పేదలకు అందాల్సిన కార్పొరేట్ వైద్యాన్ని దూరం చేయడం దుర్మార్గం అంటూ ఆరోపించారు.

New Update
ఆరోగ్యశ్రీని.. అనారోగ్యశ్రీగా మార్చారంటూ సీఎం కేసీఆర్‌‌పై షర్మిల ఫైర్

మహానేత వైయస్ఆర్ తెచ్చిన పథకాలు అద్భుతమని, వాటి అమలులో పిచ్చి భేషజాలు లేవని, అసెంబ్లీ వేదికగా గొప్పలు చెప్పిన దొరగారు.. ఇన్నాళ్లు చెప్పిందొకటి చేసిందొకటి. పైకి కపట ప్రేమను నటిస్తూ.. లోపల కాలకూట విషాన్ని చిమ్ముతుండని అన్నారు. సంజీవనిలా పనికొచ్చే ఆరోగ్యశ్రీని కోమాలో పెట్టి అనారోగ్యశ్రీగా మార్చారంటూ మండిపడ్డారు. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని దూరం చేశారని హాట్ కామెంట్స్‌ చేశారు.

తెలంగాణలో కార్పొరేట్ వైద్యం సర్వనాశనం

ఏటికేటా బిల్లులు చెల్లించక ఆరోగ్యశ్రీ పేరు చెప్తేనే కేసులు పట్టకుండా చేశారు. కంటికి పంటికి జబ్బు చేస్తే ఢిల్లీకి, కార్పొరేట్ దవాఖానకు పరుగులు పెట్టే దొర.. అదే తెలంగాణలో పేదోడికి దక్కాల్సిన కార్పొరేట్ వైద్యాన్ని సర్వనాశనం చేస్తున్నాడంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత వైద్యం అందిచాల్సిన సర్కారీ దవాఖానలకే పథకాన్ని పరిమితం చేశాడని షర్మిల ట్వీట్ ద్వారా సీఎం కేసీఆర్‌పై ద్వజమెత్తారు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తే చాలు.. కేసీఆర్‌కు అన్ని ప్రేమలు గుర్తొస్తాయని.. అంతేకాకుండా.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ ఆరోగ్యశ్రీ ప్రీమియాన్ని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారని విమర్శించారు. ఆసుపత్రులకు పెండింగ్ బకాయిలు 800 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఆరోగ్యశ్రీని అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలు చేయాలంటూ షర్మిల ట్వీట్ ద్వారా తెలియజేశారు.

ఆరోగ్యశ్రీని అమలు చేయకుండా ప్రాణాలు తీసిన పాపం కేసీఆర్‌ది

తొమ్మిదేండ్లుగా ఆరోగ్యశ్రీని అమలు చేయకుండా లక్షల మంది ప్రాణాలు తీసిన పాపం కేసీఆర్ ది. కరోనాలాంటి విపత్కర పరిస్థితిలోనూ బకాయిలు చెల్లించకుండా వేలాది మంది పేదల చావులకు ప్రత్యక్ష కారకుడు కేసీఆర్. ఇన్నాళ్లు పథకంపై సవతి తల్లి ప్రేమ చూపిన దొర గారికి ఉన్నట్లుండి ప్రేమ పుట్టుకొచ్చింది. ఆరోగ్యశ్రీ ఇయ్యకుంటే ఎన్నికల్లో ప్రజలు తన్ని తరుముతరని అర్థమైంది. మీ ఎన్నికల జిమ్మిక్కులు, నక్క తెలివితేటలు ఇప్పటికైనా పక్కన పెట్టండి. ప్రజల ప్రాణాలతో నీచ రాజకీయాలు ఆపండి. ఇచ్చిన మాట ప్రకారమైనా 5 లక్షల ప్రీమియాన్ని ఆపకుండా అమలు చేయాలని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు