Diwali Holiday Cancelled: ఎన్నికల కమిషన్ షాకింగ్ నిర్ణయం.. దీపావళి సెలవు రద్దు!

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్‌ ఇచ్చింది. దీపావళి సెలవును సోమవారం నాడు రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

New Update
Diwali Holiday Cancelled: ఎన్నికల కమిషన్ షాకింగ్ నిర్ణయం.. దీపావళి సెలవు రద్దు!

తెలంగాణ ప్రభుత్వం (Ts government) దీపావళి (Deepavali) పండుగను సోమవారానికి (నవంబర్‌ 13) మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సెలవు పై ఎన్నికల సంఘం మాత్రం షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది.ఆదివారం మాత్రమే దీపావళి సెలవుగా ప్రకటిస్తూ ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సోమవారం నాడు సెలవు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఎన్నికల సంఘం తిరస్కరించింది.

ఎందుకంటే..నవంబర్‌ 13 వ తేదీన వివిధ స్థాయిల్లో సమావేశాలు, శిక్షణా తరగతులు ఉన్నాయని, ఒకవేళ సెలవు ప్రకటిస్తే ఆ కార్యక్రమాలు ఏవీ కూడా సక్రమంగా జరగవని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. పండితులు దీపావళిని నవంబర్‌ 13న జరుపుకోవాలని సూచించడంతో తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నాడే పండుగ సెలవులను మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Also read: నేటి నుంచి మూతపడనున్న బొర్రా గుహలు..ఎందుకో తెలుసా!

నిజానికి దీపావళి సెలవును ముందు ప్రభుత్వం నవంబర్‌ 12నే జరుపుకోవాలని అనుకున్నప్పటికీ..ఐచ్చిక సెలవు నవంబర్‌ 13గా జారీ చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని సవరించి నవంబర్‌ 13 ని దీపావళికి సాధారణ సెలవుగా మార్చడం జరిగింది.

తెలంగాణలో ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం చేసిన తాజా మార్పుతో విద్యా సంస్థలు , ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజుల పాటు వారాంతపు సెలవులు లభించాయి. ఈసారి దీపావళి సెలవులు నవంబర్‌ 11 వ తేదీ రెండో శనివారం , 12 ఆదివారం . దీపావళి సందర్భంగా నవంబర్‌ 13 న కూడా సెలవు ఇవ్వడంతో రాష్ట్రంలో మూడు రోజులు వరుస సెలవులు వచ్చాయి.

కానీ నవంబర్‌ 13న సెలవు దినం కాకుండా కేంద్రం ఎన్నికల సంఘం 12 నే సెలవుగా ప్రకటించడంతో విద్యార్థులు కొంచెం గందరగోళానికి గురౌతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం సెలవును రద్దు చేయడంతో విద్యార్థులు సోమవారం నాడు స్కూళ్లకు వెళ్లాల్సిందే.

అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లను సోమవారం పరిశీలించాల్సి ఉంది. ఈ క్రమంలో సెలవు ప్రకటిస్తే కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలుండడంతో ప్రభుత్వం కూడా ఎన్నికల షెడ్యూల్‌ ను ఒకరోజు ముందుకు మార్చాల్సి ఉంటుందని సీఈవో కార్యాలయం ప్రభుత్వానికి బదులిచ్చినట్లు తెలుస్తోంది.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా సెలవు గురించి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana Politics: ప్రేమ్ సాగర్ రావు Vs వివేక్.. పేలుతున్న మాటల తూటాలు!

అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వారు తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటోందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేసిన కామెంట్స్ కు వివేక్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమ కుటుంబం కారణంగానే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ గెలిచిందన్నారు. BJPలో ఉంటే కేంద్ర మంత్రి అయ్యేవాడినన్నారు.

New Update
Vivek Vs Prem Sagar Rao

Vivek Vs Prem Sagar Rao

అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వారు ఈరోజు నన్ను టార్గెట్ చేస్తున్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. ఓ కుటుంబం మంత్రి పదవి రాకుండా తన గొంతు కోసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యలకు వివేక్ కౌంటర్ ఇచ్చారు. ప్రజలకు ఎంత మంచి చేశామనేదే ముఖ్యమని.. పార్టీలు మారడం కాదన్నారు. తమ కుటుంబం సేవే చేసే కుటంబమని గుర్తించి రేవంత్ రెడ్డి తమను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారన్నారు. బీజేపీలో తానకు కేంద్రమంత్రి అయ్యే అవకాశం ఉన్నా.. కాంగ్రెనే ఎంచుకున్నానన్నారు.

జైపూర్ లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో తన తండ్రి కాకా కుటుంబం నుంచే ఎంపీలుగా గెలిచి సత్తా చాటామన్నారు. దమ్ముంటే తనపై పోటీ చేయాలని బాల్క సుమన్ సవాలు విసిరితే.. 22 రోజుల్లోనే ప్రచారం చేసి చిత్తుగా ఓడించామన్నారు. తమ గడ్డం కుటుంబం పోటీ చేయడం కారణంగానే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు. 

కేబినెట్ బెర్త్ ఎవరికి?

2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేబినెట్ లో చోటు దక్కలేదు. వివేక్ వెంకటస్వామి, ఆయన సోదరుడు వినోద్ తో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కేబినెట్ లో స్థానం కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. అయితే.. వీరిలో వివేక్ కు పక్కాగా అవకాశం దక్కుతుందన్న చర్చ కొన్ని రోజులుగా సాగుతోంది. అయితే.. దీన్ని ప్రేమ్ సాగర్ రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కష్టకాలంతో తాను పార్టీని బతికించానని.. కార్యకర్తలకు అండగా ఉన్నానని ఆయన చెబుతున్నారు. తనను కాదని పార్టీలు తిరిగి వచ్చిన వివేక్ కు ఎలా మంత్రి పదవి ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. దీంతో త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

(gaddam vivek venkataswamy | telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment