TSPSC Group 1: గ్రూప్-1 దరఖాస్తు గడువు పెంపు

తెలంగాణలో గ్రూప్ -1 పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బిగ్ అలర్ట్. నేటితో గ్రూప్-1 పరీక్ష దరఖాస్తు గడువు ముగియడంతో TSPSC కీలక ప్రకటన చేసింది. మరో రెండు రోజులు గడువు పొడిగిస్తున్నట్లు తెలిపింది.

New Update
TSPSC Group 1: గ్రూప్-1 దరఖాస్తు గడువు పెంపు

TSPSC Group 1 Application Extended: తెలంగాణలో గ్రూప్ -1 పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బిగ్ అలర్ట్. నేటితో గ్రూప్-1 పరీక్ష దరఖాస్తు గడువు ముగియడంతో TSPSC కీలక ప్రకటన చేసింది. మరో రెండు రోజులు గడువు పొడిగిస్తున్నట్లు తెలిపింది. అభ్యర్థులు ఈ నెల 16వ తేదీ వరకు గ్రూప్-1 పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.

ALSO READ: ఇవే నాకు చివరి ఎన్నికలు.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ల ఎడిట్ ఆప్షన్: మార్చి 23-మార్చి 27

ప్రిలిమ్స్: జూన్ 9

మెయిన్స్: అక్టోబర్ 21 నుంచి..

గతంలో 2 సార్లు పరీక్ష రద్దు..

గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హయాంలో 503 ఖాళీలతో 2022 ఏప్రిల్‌లో గ్రూప్ 1 నోటిఫికేషన్ (Group 1 Notification) విడుదలైంది. అదే ఏడాది అక్టోబర్ 16న ప్రిలిమ్స్ సైతం నిర్వహించి ఫలితాలను విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. కానీ, పేపర్ లీకేజీ వ్యవహారం బయటపడడంతో పరీక్షను రద్దు చేశారు. మరో సారి 2023 జూన్ 11న పరీక్ష నిర్వహించగా.. బయోమెట్రిక్ తీసుకోలేదన్న కారణంతో హైకోర్టు మరో సారి పరీక్షను రద్దు చేసింది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ పాత నోటిఫికేషన్ ను రద్దు చేసింది.. మరో 60 పోస్టులను కలిపి 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

తగ్గిన అప్లికేషన్లు..

వరుసగా రెండు సార్లు పరీక్ష రద్దు కావడంతో నిరుద్యోగుల్లో గ్రూప్-1పై ఆసక్తి తగ్గినట్లు తెలుస్తోంది. గతంలో గ్రూప్-1 కు మొత్తం 3.80 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా.. ఈ సారి పోస్టులు పెరిగినా ఇప్పటి వరకు 2.7 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. గడువు ముగిసే సమయానికి ఈ సంఖ్య 3 లక్షలు కూడా దాటే అవకాశం కనిపించడం లేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు