Whatsapp New Rule: వాట్సాప్ వాడే వారికి షాక్.. ఫోన్‌లో సిమ్ కార్డు లేకపోతే వాట్సాప్, టెలిగ్రామ్ బంద్..!

దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలను  కంట్రోల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మార్చి 1, 2026 నుండి అంటే రేపటి నుంచి 'సిమ్ బైండింగ్' (SIM Binding) నియమాన్ని అమలు చేయనుంది.

New Update
Train toilet update (26)

దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలను  కంట్రోల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మార్చి 1, 2026 నుండి అంటే రేపటి నుంచి 'సిమ్ బైండింగ్' (SIM Binding) నియమాన్ని అమలు చేయనుంది. ఈ కొత్త నియమం మెసేజింగ్ యాప్స్ అయిన వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్‌చాట్, షేర్‌చాట్ వంటి యాప్‌లన్నింటికీ ఇది వర్తిస్తుంది.

సిమ్ బైండింగ్ అంటే ఏంటి?

అసలు ఈ సిమ్ బైండింగ్ అంటే ఏంటి? అనే విషయానికొస్తే..  ఇప్పటివరకు మన ఫోన్ నెంబర్‌తో ఒక్కసారి వాట్సాప్ రిజిస్టర్ చేసుకున్నాక.. ఆ నంబర్ సిమ్ కార్డు ఫోన్‌లో లేకపోయినా వాట్సాప్ యాప్ పనిచేసేది. కానీ ఇకపై అలా కుదరదు. రేపటి నుంచి రాబోతున్న కొత్త నియమం ప్రకారం.. మీరు ఏ నంబర్‌తో వాట్సాప్ ఖాతాను ఓపెన్ చేశారో, ఆ యాక్టివ్ సిమ్ కార్డు ఖచ్చితంగా అదే ఫోన్‌లో ఉండాలి. సిమ్ కార్డు ఫోన్‌లో లేకపోతే యాప్ పనిచేయదు.

కొత్త రూల్స్ వల్ల మార్పులు:

యాప్ పనితీరు: మీరు ఫోన్ నుండి సిమ్ కార్డు తీసేస్తే, వెంటనే వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుంది. ఇది హ్యాకర్లు మీ నంబర్‌ను వేరే పరికరంలో ఉపయోగించకుండా నిరోధిస్తుంది.

వాట్సాప్ వెబ్: డెస్క్‌టాప్ లేదా వెబ్‌లో వాట్సాప్ వాడుతున్నప్పుడు, భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ (Log Out) అవుతుంది. మీరు మళ్ళీ క్యూఆర్ కోడ్ (QR Code) స్కాన్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

సైబర్ భద్రత: ప్రభుత్వం ప్రకారం, ఈ విధానం వల్ల సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం చాలా సులభమవుతుంది. యూజర్ల భద్రత కోసం తీసుకున్న ఈ నిర్ణయంలో ఎటువంటి సడలింపులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisment
తాజా కథనాలు