/rtv/media/media_files/2026/05/26/pulsar-n160-2026-05-26-15-39-36.jpg)
Pulsar N160
Pulsar N160: 2026 బజాజ్ పల్సర్ N160 బైక్‌ను తాజాగా కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ బైక్ ధర ఢిల్లీలో ఎక్స్‌షోరూమ్ ప్రకారం రూ.1.22 లక్షలు. కంపెనీ ఈ మోడల్‌ను మొత్తం నాలుగు రంగుల్లో అందిస్తోంది. అవి బ్రూక్లిన్ బ్లాక్, పెర్ల్ మెటాలిక్ వైట్, రేసింగ్ రెడ్, గ్రే.
బ్రూక్లిన్ బ్లాక్ కలర్ బైక్‌కు స్టైలిష్, స్పోర్టీ లుక్ అందిస్తుంది. పెర్ల్ మెటాలిక్ వైట్ కలర్ మాత్రం ప్రీమియం ఫీల్‌తో పాటు క్లాస్ లుక్‌ను అందిస్తుంది. రేసింగ్ రెడ్ కలర్ ఎప్పటిలాగే ఆకర్షణీయంగా కనిపిస్తూ బైక్‌కు అగ్రెసివ్ స్టైల్‌ను ఇస్తుంది. ఇక గ్రే కలర్ సాధారణంగా, సింపుల్ లుక్ ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది.
Bajaj Auto has launched a new variant of the Bajaj Pulsar N160 at ₹1.22 lakh (Ex-Showroom, Delhi), bringing more premium hardware and sporty appeal .
— 91Wheels.com (@91wheels) May 21, 2026
⚙️ Key Highlights:
🔸 Gold USD forks
🔸 ABS technology
🔸 Assist & slipper clutch
🔸 LED projector headlamp
🔸 USB Type-C… pic.twitter.com/h5CwadniYJ
2026 పల్సర్ N160లో వచ్చిన ప్రధాన మార్పు అసిస్ట్, స్లిప్పర్ క్లచ్. ఈ ఫీచర్ వల్ల ట్రాఫిక్‌లో క్లచ్ ఉపయోగించడం సులభంగా ఉంటుంది. అలాగే స్పీడ్ గా గేర్ తగ్గించినప్పుడు వెనుక చక్రం అదుపు తప్పకుండా సహాయపడుతుంది.
ఇంకా ఈ బైక్‌లో గోల్డ్ ఫినిష్ ఉన్న USD ఫ్రంట్ ఫోర్క్స్ ఇచ్చారు. ఇవి బైక్ లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చడంతో పాటు మలుపుల్లో మంచి కంట్రోల్ అందిస్తాయి. బ్రేకింగ్ సమయంలో కూడా బైక్ స్టేబుల్‌గా ఉండేందుకు సహాయపడతాయి.
ఫీచర్ల విషయానికి వస్తే ABS, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, సింగిల్ పీస్ సీటు వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి.
ఇంజిన్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ బైక్‌లో అదే 164.82cc ఇంజిన్ ఉంటుంది. ఇది 15.5 bhp పవర్, 14.65 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.
Follow Us