/rtv/media/media_files/2026/04/30/poco-c81-pro-2026-04-30-20-56-56.jpg)
Poco C81 Pro
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ POCO తన లైనప్‌లో ఉన్న మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. Poco C81 Pro ను ప్రపంచ మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ యునిసోక్ టి7250 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 13-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 8-మెగాపిక్సెల్ ముందు కెమెరా ఉన్నాయి. ఇది 6.9-అంగుళాల ఎల్‌సిడి డిస్‌ప్లేను కలిగి ఉంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇప్పుడు Poco C81 Pro ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర గురించి తెలుసుకుందాం.
Poco C81 Pro Price
Poco C81 Pro మొబైల్ 4GB+64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,300, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,000, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,000గా ఉంది. ఈ ఫోన్ బ్లాక్, గోల్డ్, గ్రీన్ కలర్‌లలో లభిస్తుంది. ఇది ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులో ఉంది.
Poco C81 Pro Specifications
Poco C81 Pro లో 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ ఆధారిత హైపర్‌ఓఎస్ 3 పై పనిచేస్తుంది. Poco C81 Pro లో మాలి-G57 GPUతో కూడిన 12nm ఆక్టా-కోర్ యూనిసోక్ T7250 ప్రాసెసర్ ఉంది. ఇందులో 4GB RAM, 256GB వరకు UFS 2.2 స్టోరేజ్ ఉంది. దీనిని 8GB వరకు పెంచుకోవచ్చు.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. Poco C81 Pro వెనుక భాగంలో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియోల కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ కొత్త పోకో ఫోన్ వెట్ టచ్ టెక్నాలజీ 2.0కి సపోర్ట్ చేస్తుంది. ఈ టెక్నాలజీ వల్ల దీనిని తడి వేళ్ళతో శుభ్రం చేయవచ్చు. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఒకే ఛార్జ్‌పై 79 గంటలకు పైగా మ్యూజిక్ ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో బ్లూటూత్ 5.2, వై-ఫై, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఇది ఫేస్ రికగ్నిషన్‌కు కూడా మద్దతు ఇస్తుంది.
Follow Us