Bike Mileage Tips: బైక్ మైలేజీని పెంచే అద్భుతమైన చిట్కాలు: ఇప్పుడు జనాలకి నువ్వ అవసరం..!

ప్రస్తుతం పెట్రోల్, డీజీల్ దొరకడం కష్టంగా మారింది. ఈ తరుణంలో వాహనదారులు తమ జేబుకు చిల్లు పడకుండా ఉండాలన్నా.. ఉన్న తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించాలన్నా మైలేజీపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

New Update
bike mileage increase tips

bike mileage increase tips

అమెరికా, ఇజ్రాయెల్ -  ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో భారత్‌లో ఇంధన సమస్య పెరిగిపోయింది. పెట్రోల్, డీజీల్ దొరకడం కష్టంగా మారింది. పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరినా చుక్క కూడా దొరకడం లేదు. ఈ తరుణంలో వాహనదారులు తమ జేబుకు చిల్లు పడకుండా ఉండాలన్నా.. ఉన్న తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించాలన్నా మైలేజీపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల మీ బైక్ మైలేజీని పెంచుకోవడానికి, అలాగే పెట్రోల్‌ను పొదుపు చేసుకోవడానికి కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. 

టైర్ ప్రెజర్

బైక్ మైలేజీ పెరగాలన్నా, తగ్గాలన్నా టైర్లలో ఉండే గాలి అంత్యంత ముఖ్యమైన అంశం. ఎందుకంటే బైక్ టైర్లలో గాలి తక్కువగా ఉంటే.. రోడ్లపై ప్రయాణించేటప్పుడు టైర్ల ఘర్షణ పెరుగుతుంది. దీనివల్ల ఇంజిన్‌పై ఎక్స్‌ట్రా భారం పడి ఎక్కువ పెట్రోల్ ఖర్చవుతుంది. అందువల్ల వారానికి ఒకసారి గాలిని చెక్ చేయాలి. టైర్లలో సరైనా గాలి ఉండటం వల్ల మైలేజీ 5 శాతం నుండి 10 శాతం వరకు పెరుగుతుంది. 

నిలకడైన వేగం

చాలా మంది తమ వాహనాన్ని అధిక వేగంతో డ్రైవ్ చేస్తారు. ఇలా వెళ్తే పెట్రోల్ తక్కువ అవుతుందని, వేగంగా గమ్యానికి చేరుకోవచ్చని అనుకుంటారు. కానీ అది పెద్ద పొరపాటు. బైక్‌ను సరైన వేగంతో నడపడం వల్ల మాత్రమే పెట్రోల్ ఆదా అవుతుంది. సాధారణంగా గంటకు 40 నుండి 50 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తే మంచి మైలేజీ వస్తుంది. 

ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇంజిన్ ఆపడం

సిటీల్లో ట్రాఫిక్ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. సిగ్నల్ పడిందంటే దాదాపు కిలో మీటర్ల మేర వాహనదారులు నిలిచిపోతారు. ఆ సమయంలో ఇంజిన్ ఆన్ చేసి ఉంచడం వల్ల అనవసరంగా పెట్రోల్ వృధా అవుతుంది. అందువల్ల ఎప్పుడైనా సిగ్నల్ పడినపుడు 30 సెకన్ల కంటే ఎక్కువ టైం పడితే వెంటనే ఇంజిన్ ఆపడం బెటర్. దీనివల్ల పెట్రోల్ ఆదా అవుతుంది. 

సరిగ్గా గేర్ వేయడం

బైక్ మైలేజీ విషయంలో సరిగ్గా గేర్ వేయడం అత్యంత ముఖ్యమైన అంశం. తక్కువ గేర్‌‌లో వేగంగా రైడ్ చేయడం లేదా ఎక్కువ గేర్లు వేసి తక్కువ వేగంతో ప్రయాణించడం వల్ల ఇంజిన్‌పై ప్రభావం పడటమే కాకుండా మైలేజీ మొత్తం పడిపోతుంది. అందువల్ల వేగానికి అనుగుణంగా మాత్రమే గేర్లు ఉపయోగించాలి. 

ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్ చెకింగ్

బైక్‌లో ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్ అనేది చాలా కీలకం. ఇంజిన్‌లోకి వెళ్లే గాలి శుభ్రంగా ఉండాలి. ఒకవేళ దుమ్ము ధూళి చేరితే ఇంజిన్‌ సరిగ్గా పనిచేయదు. అలాగే స్పార్క్ ప్లగ్ ఇంజిన్‌లో పెట్రోల్ మండించడానికి అవసరమైన నిప్పురవ్వను అందిస్తుంది. ఇది సరిగా లేకపోయితే పెట్రోల్ వృథా అవుతుంది. అందువల్ల బైక్‌ను సర్విసింగ్‌ ఇచ్చేటప్పుడు ఎయిర్ ఫిల్టర్‌ను క్లీన్ చేయించాలి. లేదా మార్చాలి. దీంతోపాటు స్పార్క్ ప్లగ్‌ను చెక్ చేయాలి. 

చైన్ లూబ్రికేషన్

బైక్ చైన్ ఎప్పుడూ ఆయిల్‌తో తడిగా ఉండాలి. ఒకవేళ పొడిగా ఉన్నా మట్టి పేరుకుపోయినా ఇంజిన్ నుండి వెనుక టైర్‌కు శక్తి ప్రసరణ సరిగ్గా జరగదు. దీనివల్ల కూడా బైక్ మైలేజీ తగ్గుతుంది. అందువల్ల అప్పుడప్పుడు చైన్‌ను క్లీన్ చేస్తూ ఉండాలి. 

ఎక్స్‌ట్రా వెయిట్

బైక్‌పై అదనపు బరువు ఉండటం వల్ల ఇంజిన్‌పై ప్రభావం పడుతుంది. దీనివల్ల ఇంజిన్ శక్తి ఎక్కువగా ఉపయోగించుకోవాల్సి వస్తుంది. అప్పుడు మైలేజీ తక్కువ వస్తుంది. 

కల్తీ పెట్రోల్‌కు చెక్

చాలా మంది పెట్రోల్ బంకుల్లో కాకుండా రోడ్ల పక్కన ఉండే బాటిళ్లలోని పెట్రోల్ కొడుతుంటారు. దీనివల్ల కల్తీ జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు బైక్ మైలేజీ తగ్గుతుంది. కాబట్టి కొంచెం లేటు అయినా బంకుల్లోనే పెట్రోల్ కొట్టించడం మంచిది.

ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల మీ బైక్ మైలేజీని చాలా వరకు పెంచుకోవచ్చు.

Advertisment
తాజా కథనాలు