AC Safety Tips: ఏసీలు ఎందుకు పేలుతున్నాయి? ఈ 5 తప్పులు చేస్తే ప్రాణాలకే ప్రమాదం!

ఏసీలు వేడెక్కడం, గ్యాస్ లీక్, పాత వైరింగ్, సర్వీసింగ్ చేపించకపోవడం వంటి కారణాల వల్ల పేలే ప్రమాదం ఉంటుంది. అవుట్‌డోర్ యూనిట్‌కు గాలి లేకపోవడం, ఎక్కువ సేపు వాడటం కూడా పేలే రిస్క్ పెరుగుతుంది. రెగ్యులర్ సర్వీసింగ్ ద్వారా ఈ ప్రమాదాలను నివారించవచ్చు.

New Update
AC Safety Tips

AC Safety Tips

AC Safety Tips: వేసవిలో ఏసీ మనకు చల్లదనం ఇస్తుంది. కానీ అదే ఏసీ కొన్నిసార్లు పెద్ద ప్రమాదంగా మారొచ్చు. ఇటీవల ఢిల్లీ, ఘజియాబాద్ వంటి చోట్ల ఏసీ పేలుడు ఘటనల్లో ప్రాణ నష్టం కూడా జరిగింది. ఫ్రిడ్జ్ పేలుడు ఘటనలు కూడా చోటు చేసుకోవడంతో ప్రజల్లో భయం పెరిగింది.

అసలు ఏసీలు ఎందుకు పేలుతాయి? మనం చేసే చిన్న నిర్లక్ష్యాలే ఎలా ప్రమాదాలకు ఎలా దారి తీస్తాయో ఇప్పుడు చూద్దాం.

ఏసీ పేలడానికి ప్రధాన కారణాలు Causes for AC Explosions

ఏసీ ఒక్కసారిగా పేలిపోవడం సాధారణంగా జరగదు. చాలా సందర్భాల్లో ముందు నుంచే సమస్యల వల్ల పేలుతుంది.

ప్రధాన కారణాలు ఇవే:

  • ఏసీ లోపల ఎక్కువ వేడి (Overheating)
  • దుమ్ము పేరుకుపోవడం వల్ల గాలి సరిగా వెళ్లకపోవడం
  • పాత లేదా డిఫెక్టివ్ వైరింగ్
  • షార్ట్ సర్క్యూట్
  • రిఫ్రిజరెంట్ గ్యాస్ లీక్
  • కంప్రెసర్ మీద ఎక్కువ ఒత్తిడి

గ్యాస్ లీక్ అయినప్పుడు చిన్న స్పార్క్ తగిలినా పెద్ద మంటలు రావచ్చు.

Also Read: ఏసీ వాడుతున్నా కరెంట్ బిల్లు రాకూడదా?.. ఈ జంతర్ మంతర్ టిప్స్ పాటిస్తే చాలు..!

మనం చేసే 5 పెద్ద తప్పులు

1. సర్వీసింగ్ చేయకపోవడం

“ఏసీ బాగానే ఉంది కదా” అని చాలామంది సర్వీస్ చేయరు. కానీ దుమ్ము పేరుకుపోతే ఏసీ వేడెక్కే అవకాశం ఉంటుంది.

2. పాత వైరింగ్ వాడటం

ఏసీకి ఎక్కువ విద్యుత్ అవసరం. పాత లేదా నాసిరకం వైర్లు వాడితే షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఎక్కువ.

3. ఎక్కువ గంటలు ఆన్‌లో ఉంచడం

ఏసీని నిరంతరం నడిపితే కంప్రెసర్ వేడెక్కుతుంది. ఇది పేలుడుకు దారి తీస్తుంది.

4. అవుట్‌డోర్ యూనిట్‌కు గాలి లేకపోవడం

అవుట్‌డోర్ యూనిట్ ఇరుకుగా లేదా గాలి ఆడని చోట ఉంటే వేడి బయటకు వెళ్లదు. దాంతో ప్రెజర్ పెరుగుతుంది.

5. గ్యాస్ లీక్‌ను పట్టించుకోకపోవడం

చల్లదనం తగ్గడం, వాసన రావడం, శబ్దం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సర్వీస్ చేయించాలి.

ఫ్రిడ్జ్ కూడా ఎందుకు పేలుతోంది? Why Refrigerators Explode

ఏసీ మాత్రమే కాదు, ఫ్రిడ్జ్‌లు కూడా కొన్ని సందర్భాల్లో పేలుతున్నాయి.

Also Read: బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే వైఫై ప్లాన్.. గ్రామాల్లో ఇంటర్నెట్ పండగే..!

కారణాలు:

  • కంప్రెసర్ వేడెక్కడం
  • వోల్టేజ్ సమస్యలు
  • పాత వైరింగ్
  • ఫ్రిడ్జ్ వెనుక గాలి సరిగా వెళ్లకపోవడం
  • గ్యాస్ లీక్

ఫ్రిడ్జ్‌ను గోడకు దగ్గరగా ఉంచితే కూడా వేడి బయటకు వెళ్లదు. దాంతో ప్రమాదం పెరుగుతుంది.

Also Read: సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 180 కి.మీ మైలేజీ.. ఫీచర్లు అదుర్స్..!

ఏసీ సురక్షితంగా వాడడానికి చిట్కాలు Tips for Safe AC Usage

ప్రతి 6 నెలలకు సర్వీసింగ్ చేయించాలి
24–26 డిగ్రీలలో ఏసీ వాడటం మంచిది
నాణ్యమైన స్టెబిలైజర్ ఉపయోగించాలి
నెలకు ఒకసారి ఫిల్టర్ శుభ్రం చేయాలి
వింత శబ్దం లేదా వాసన వస్తే వెంటనే ఆఫ్ చేయాలి
అవుట్‌డోర్ యూనిట్‌కు గాలి వచ్చేలా ఖాళీగా ఉంచాలి

ఏసీ రిపేరింగ్ సమయంలో జాగ్రత్తలు

  • పవర్ పూర్తిగా ఆఫ్ చేయాలి
  • అనుభవం ఉన్న టెక్నీషియన్‌కే రిపేర్ ఇవ్వాలి
  • సర్వీసింగ్ సమయంలో యూనిట్ ఆన్ చేయకూడదు
  • గ్యాస్ లీక్ టెస్ట్ జాగ్రత్తగా చేయాలి.

Also Read: ఊచకోత స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్లు చూస్తే వెంటనే కొనేస్తారు..!

అయితే మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది. ఏసీ పేలుళ్లు అరుదే కానీ చాలా ప్రమాదకరం. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి కారణం అవుతుంది. రెగ్యులర్ సర్వీసింగ్‌తో సమస్యలు నివారించవచ్చు. జాగ్రత్తలు పాటించకపోతే ఏసీ ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. సరైన మెయింటెనెన్స్ ఉంటే ఏసీ సురక్షితంగానే ఉంటుంది.

Advertisment
తాజా కథనాలు