Mobile Charger: మొబైల్ ఛార్జర్ కొనుగోలు చేస్తున్నారా? ఈ గుర్తును తప్పక చెక్ చేయండి..

కొత్త మొబైల్ ఛార్జర్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే, చార్జర్ కొనుగోలు చేసే ముందు దాని వెనుక భాగంలో చతురస్ర ఆకారంలో రెండు గుర్తులు ఉంటాయి. అది ఉంటే.. ఛార్జర్ ఫర్‌ఫెక్ట్ అని, మంచి మెటీరియల్‌తో తయారు చేయబడిందని అర్థం.

New Update
Mobile Charger: మొబైల్ ఛార్జర్ కొనుగోలు చేస్తున్నారా? ఈ గుర్తును తప్పక చెక్ చేయండి..

Mobile Charger Tips: ఫోన్ ఛార్జ్‌ పెట్టి, కాల్స్ మాట్లాడుతూ విద్యుదాఘాతానికి గురై ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చూశాం. ఛార్జర్‌లో లోపం కారణంగానే ఇలా జరుగుతుందని అనేక పరిశీలనల్లో తేలింది. ఛార్జర్ పాడైతే.. ఫోన్ ఛార్జింగ్ పాయింట్ కూడా త్వరగా పాడైపోతుంది. మరి ఎలాంటి ఛార్జర్ కొనుగోలు చేయాలి? ఛార్జర్ కొనుగోలు చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే సందేహాలు చాలా మందిలో వస్తుంటాయి. మరి మార్కెట్‌లో ఛార్జర్‌ను కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి ఛార్జర్‌ను కొనుగోలు చేయాలి? ఏది మంచిది? ఏది చెడ్డది? ఎలా గుర్తించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మంచి ఛార్జర్‌ను ఎలా గుర్తించాలి?

షోరూమ్ నుండి ఒరిజినల్ ఛార్జర్‌ని కొనుగోలు చేయలేని స్థితిలో చాలా మంది బయట మార్కెట్‌లో తక్కువ ధరకు లభించే ఛార్జర్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఛార్జర్‌ను కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఛార్జర్ వెనుక భాగంలో రెండు చతురస్రాల ఆకృతిని చూడాలి. ఛార్జర్‌పై ఆ గుర్తు ఉంటే.. ఛార్జర్ మంచి మెటీరియల్‌తో తయారు చేయబడిందని, మన్నికైనదని భావించొచ్చు.

8 అంకెల గుర్తు కూడా..

చతురస్రాకార గుర్తే కాకుండా.. ఛార్జర్‌పై 8 అంకెల గుర్తు కూడా ఉంటుంది. వాస్తవానికి, మన్నికైన అన్ని ఛార్జర్‌లపై ఎనిమిది అంకెల కోడ్ ఉంటుంది. ఈ కోడ్ ద్వారా ఛార్జర్‌కు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. ఈ ఎనిమిది అంకెల కోడ్ ఛార్జర్ వెనుక భాగంలో ఉంటే.. దానిని BIS కేర్ వెబ్‌సైట్‌లో ఎంటర్ చేయడం ద్వారా చెక్ చేయవచ్చు. వెబ్‌సైట్‌లో ఈ కోడ్‌ను నమోదు చేసిన వెంటనే.. ఛార్జర్ ఏ మెటీరియల్‌తో తయారు చేయబడిందో తెలిసిపోతుంది. ఏ కంపెనీ దీన్ని తయారు చేసింది? ఎంత మెరుగ్గా ఉంది? దీనితో పాటు, ఈ ఛార్జర్‌తో ఏమేం ఛార్జ్ చేయవచ్చో కూడా తెలుస్తుంది.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను టెక్ నిపుణులు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అందించడం జరిగింది. దీనిని RTV ధృవీకరించడం లేదు.

Also Read:

మంత్రి కేటీఆర్‌కు రూ. లక్ష చెక్కు అందజేసిన శంకరమ్మ..

తెలంగాణ ఎన్నికల బరిలో యంగ్ లీడర్స్ వీరే..

Advertisment
Advertisment
తాజా కథనాలు