చాట్ జీపీటీ టీచర్‌గా రోబో, హార్వర్డ్‌లో కొత్త ప్లాన్‌...

టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఎటు చూసినా, అందరి నోళ్లలో ఛాట్‌జీపీటీ పేరు నానుతోంది. ఏ పనిచేసినా, ఏం డౌటొచ్చిన సరే.. పరిష్కారం కోసం చిన్నా, పెద్దా తేడా లేకుండా విద్యార్థుల నుంచి ప్రొఫెషనళ్ల దాకా దీని సాయం కోరుతూ తమ పనుల్ని ఈజీగా సాల్వ్‌ చేసుకుంటున్నారు. అయితే ఛాట్‌ జీపీటీ సామర్థ్యం, పనితీరుని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ ఉపయోగించుకోనుంది. తన విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మేధ సాయంతో విద్యార్థులకు బోధించేలా అడుగులు వేస్తోంది.

New Update
చాట్ జీపీటీ టీచర్‌గా రోబో, హార్వర్డ్‌లో కొత్త ప్లాన్‌...

tech-harvard-to-leverage-capabilities-of-chat-gpt-as-a-instructor-to-its-students

ఛాట్‌ జీపీటీ సామర్థ్యాలతో పనిచేసే AI ఛాట్‌బాట్‌ను విద్యార్థులకు బోధించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తంది. విశ్వవిద్యాలయంలో ప్రముఖమైన కంప్యూటర్ సైన్స్‌ విభాగంలో "కంప్యూటర్ సైన్స్ పరిచయం (CS50)" కోర్సుతో ఈ ఛాట్‌బాట్‌ని అనుసంధానించబోతోంది. సెప్టెంబర్ మాసంలో ఈ టూల్‌ని వినియోగంలోకి తీసుకురానున్నారు. దీనిని జీపీటీ 3.5 లేదా జీపీటీ 4 మోడళ్లతో తయారుచేశారు. ఇది విద్యార్థులకు పాఠ్యాంశాల్లో వచ్చే సందేహాలు, సమస్యల్ని అప్పటికపుడు తీర్చడంలో సాయపడనుంది. యూనివర్సిటీ ప్రొఫెసర్ హార్వర్డ్ క్రిమ్సన్ మాట్లాడుతూ.. "విద్యార్థులకు క్యాంపస్ పగలు రాత్రి అన్న తేడా లేకుండా ఎల్ల వేళలా సాయపడేలా ఈ సాఫ్ట్‌వేర్‌ టూల్‌ని రూపొందించాం.

publive-image

ఇతర ఆన్‌లైన్ మాధ్యమాల్లో లేనివిధంగా విద్యార్థులు ఎవరికి వారు తమ సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చన్నారు. ప్రతీ విద్యార్థికి 1 టీచర్ (1:1) ఉండాలనే దీనిని తెచ్చామన్నారు." AI టూల్స్ విశేష ఆదర చూరగొంటున్న ప్రస్తుత తరుణంగా ఇటువంటి బోధన పరమైన సాధనాలు పలు ఆందోళనలు కూడా రేకెత్తిస్తున్నాయి. వీటి వినియోగం పెరిగితే సాంప్రదాయ ఉపాధ్యాయ ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. AI టూల్స్ అన్ని వేళలా సరియైన సమాధానాలు ఇవ్వకపోవచ్చన్న వాదనా ఉంది. గూగుల్‌ కూడా తన AI టూల్ బార్డ్‌పై ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అతిగా దీనిపై ఆధరపడటం కూడా సరికాదంటున్నారు నిపుణులు.

ఛాట్‌జీపీటీ వంటి సాధనాలు కేవలం పరిష్కారాలు ఇస్తాయి. కానీ తమ తెలివిని ఉపయోగించి విషయాన్ని క్రోడీకరించుకుని, నిర్ణయం తీసుకోవాల్సింది విద్యార్థులేనని వెల్లడించారు 2022 నవంబర్‌లో ఓపెన్‌ఏఐ కంపెనీ విడుదల చేసిన ఛాట్‌జీపీటీ టూల్ అనతి కాలంలోనే 100 మిలియన్ల యాక్టివ్‌ వినియోగదారులతో అతి తక్కువ కాలంలో ఈ ఘనత సాధించిన మొదటి అప్లికేషన్‌గా నిలిచింది. తన సామర్థ్యాలతో పలు రంగాల్లో ఉద్యోగాలకు ఎసరు తెచ్చేలా వెళ్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు