/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-29T004214.810-jpg.webp)
Under 19 World Cup : అండర్ 19 వరల్డ్ కప్(World Cup) లో భారత యువజట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. గ్రూప్ స్టేజ్‌లో యూఎస్‌ఏ(USA) పై 201 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించిన టీమిండియా(Team India) ఈ విజయంతో హ్యాట్రిక్ నమోదు చేసింది. 327 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఎస్‌ఏ జట్టు ఛేజింగ్‌లో తేలిపోయింది. ఏ దశలోనూ ప్రతిఘటించలేక మ్యాచ్‌ను టీమిండియా చేతుల్లో పెట్టేసింది.
ఇది కూడా చదవండి: ఐసీసీ కీలక నిర్ణయం..శ్రీలంక క్రికెట్‌పై నిషేధం ఎత్తివేత..!!
నిర్ణీత ఓవర్లలో ప్రత్యర్థి జట్టు 8 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. ఉత్కర్ష్ శ్రీవాత్సవ 40 పరుగులు చేశాడు. ఆమోఘ్ ఆరేపల్లి (27*), ఆరిన్ నడక్కర్ణి (20) ఓటమి అంతరాన్ని కొంత తగ్గించగలిగారు. భారత బౌలర్లు నమన్ తివారి నాలుగు, రాజ్ లింబాని, మురుగన్ అభిషేక్, ప్రియాన్షు మోలియా, సౌమీ పాండే తలో వికెట్ తీశారు.
Innings Break!#TeamIndia post 326/5 in the first innings.
💯 from Arshin Kulkarni
73 from Musheer KhanOver to our bowlers 💪
Scorecard ▶️ https://t.co/OAbsdAHOj5#BoysInBlue | #INDvUSA pic.twitter.com/yfxSdL8HWY
— BCCI (@BCCI) January 28, 2024
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్(India) నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. అర్షిన్ కులకర్ణి (108) సెంచరీ సాధించగా; ముషీర్ ఖాన్ (73) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (25)తో అర్షిన్ కులకర్ణి తొలి వికెట్‌కు 46 పరుగులు చేశాడు. ఆదర్శ్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ముషీర్ ఖాన్‌తో కలిసి అర్షిన్ రెండో వికెట్‌కు ఏకంగా 155 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. అనంతరం కెప్టెన్ ఉదయ్ సహరన్ (35)తో మరో 56 పరుగుల పార్టనర్ షిప్ నమోదు చేశాడు. అనంతరం వరుసగా వికెట్లు కోల్పోయింది. ప్రియాన్షు మోలియా 27, సచిన్ ధాస్ 20, ఆరవెల్లి అవనీశ్ 12* పరుగులు చేశారు. యూఎస్‌ఏ బౌలర్లు అతీంద్ర సుబ్రమణియన్ 2; ఆరిన్ నడ్కరి, ఆర్య గార్గ్, రిషి రమేశ్ తలో వికెట్ పడగొట్టారు. మంగళవారం నుంచి సూపర్ సిక్స్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.
Also Read : ఐసీసీ కీలక నిర్ణయం..శ్రీలంక క్రికెట్‌పై నిషేధం ఎత్తివేత..!!