AP Politics: ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రాణం తీసింది..చిన్నారి మృతికి బాధ్యత వహించాలి: వంగలపూడి అనిత

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఇటీవల పాయకరావుపేట దుర్గానగర్ ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ స్లాబ్ కూలి మృతి చెందిన విద్యార్థి సిద్దు ప్రసన్న తల్లిదండ్రులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

New Update
AP Politics: ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రాణం తీసింది..చిన్నారి మృతికి బాధ్యత వహించాలి:  వంగలపూడి అనిత

ఏపీలోని పాఠశాలల్లో నాడునేడు పథకం కింద చేపట్టిన పనుల్లో నాణ్యత లోపాలు, నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని వంగలపూడి అనిత అన్నారు. గతంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో విద్యుత్ స్తంభం కూలి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. తాజాగా పాయకరావుపేట దుర్గా కాలనీలో సిమెంట్‌ పలక పడడంతో తులసి సిద్దు ప్రసన్న అనే బాలుడు మృతి చెందాడు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి  పర్యటించారు. ఇటీవల పాయకరావుపేట దుర్గానగర్ ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ స్లాబ్ కూలి మృతి చెందిన విద్యార్థి సిద్దు ప్రసన్న తల్లిదండ్రులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలలో స్లాబ్ కూలి విద్యార్థి మృతి చెందడం చాలా బాధాకరం అన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన విద్యార్థి కుటుంబ సభ్యులను ఇంతవరకు స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పరామర్శించలేదని ఆరోపించారు.

పోలీసులపై ఆగ్రహం

పరామర్శించడానికి తీరిక లేకుండా ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఉన్నారు అంటూ ఎద్దేవా చేశారు. సంఘటనకు సంబంధించిన వారిపై నేను కేసు పెట్టినా.. చర్యలు లేవని ఆరోపణ చేశారు. బెయిలబుల్ కేసు నమోదు చేసి తూతూ మంత్రంగా వ్యవరిస్తున్నారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబానికి రూ.20 నుంచి 40 లక్షల వరకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలాన్నీ పరిశీలించిన కలెక్టర్ 2 లక్షలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని ఆమె అన్నారు. దీనిపై కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే మేము కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు.

బిల్లులు పెండింగ్‌ 

కాగా.. ఏపీలో రెండో విడత నాడు-నేడుకు నిధుల కొరతతో అదనపు తరగతి గదులు, ప్రహారీల నిర్మాణాల పనులను గత ఫిబ్రవరి నుంచి జులై వరకు వాయిదా వేయగా.. ఇటీవలే మళ్లీ పనులు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 12 వేలకుపైగా అదనపు తరగతి గదులు నిర్మించాల్సంది. ఇవి.. ఇప్పటి వరకు 50 శాతంలోపే పూర్తయ్యాయి. అయితే.. వీటికి సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో పనులు వేగంగా జరగటంలేదు. అంతేకాదు.. నిర్మాణాలకు తీసుకొచ్చిన సామగ్రి మొత్తాన్ని పాఠశాల ఆవరణల్లో పడేయటంతో పిల్లలు ఆడుకునేందుకు స్థలం లేకుండాపోయింది. అయితే.. విద్యార్థులు తెలియక అటువైపు వెళ్తున్న టైంలో ప్రమాదాల బారిన పడుతున్నారు.

ఇది కూడా చదవండి: ఖమ్మంలో పొలిటికల్ వార్.. పువ్వాడ వర్సెస్ తుమ్మల..పొంగులేటి

Advertisment
Advertisment
తాజా కథనాలు