TDP Somi reddy: విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే మైన్స్ కుంభకోణం..సోమిరెడ్డి షాకింగ్ కామెంట్స్.!

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే మైన్స్ కుంభకోణం జరుగుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ దానికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టారు .

New Update
TDP Somi reddy: విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే మైన్స్ కుంభకోణం..సోమిరెడ్డి షాకింగ్ కామెంట్స్.!

TDP Somi reddy: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ కు సంబంధించిన ఆధారాలను బయటపెట్టారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్ది. దేశంలో స్వతంత్రం వచ్చిన తరువాత అతిపెద్ద స్కామ్ లు ఓబుళపురం ఐరన్ ఓవర్.. మధుకోడా మైనిగ్ స్కామ్ అని ఆరోపించారు. ఇప్పుడు చాలా కాలం తరువాత సిలికా స్కామ్, క్వాడ్జ్ స్కామ్ ఏపీలో జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాను పోరాటలకు పుట్టినిల్లు నుండి భారీ స్కామ్ లకు పుట్టినిల్లిగా తెచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్దిదని విమర్శలు గుప్పించారు. ఈ స్కామ్ లపై ఎన్ని పోరాటాలు చేస్తున్న, డిజిపికి పిర్యాదు చేసిన అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి హయాంలో ఒక్క టన్నుకి రూ.100 పన్ను ఉండగా.. వైసిపీ హయాంలో రూ. 381 రూపాయలకు పెంచేసారని మండిపడ్డారు.

Also Read: నాదెండ్ల మనోహర్ అరెస్ట్.. పవన్ సీరియస్ వార్నింగ్..!

నెల్లూరులో విజయసాయి రెడ్ది ఆధ్వర్యంలోనే మైన్స్ కుంభకోణం జరుగుతుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒకటో తేదీన జగన్మోహన్ రెడ్డికి కమిషన్ చేరుస్తున్నారని వ్యాఖ్యనించారు. 3 కోట్ల టన్నులు.. 4455 కోట్లు విలువ చేసే విలువైన కనిజ సంపద దోచేశారని మండిపడ్డారు. అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మూడేళ్ళల్లో 371 కోట్లు మైన్స్ మీద పెనాల్టీ వేశారని..371 కోట్లు ఎందుకు పెనాల్టీ వేశారు.? ఎంత వసూలు చేశారు.? అని నిలదీశారు.

సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకణి ఊరు ప్రక్కన దోపిడీ జరుగుతుంటే.. చూస్తున్న కాకణికి చీరా, గాజులు పంపించాలని ఎద్దెవ చేశారు. డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలాజీ అధికారుల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. తెలుగుదేశం హయాంలో ఉన్న లీజు దారులకు తిరిగి మైన్స్ అప్పగించాలని డిమాండ్ చేశారు. హై కోర్టు ఇచ్చిన ఆర్డర్ ను సైతం దిక్కరించిన అధికారులు, మంత్రి మీద కాంటెమ్ట్ అఫ్ కోర్టు క్రింద కేసు నమోదు చేయాలన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు