TDP: ఉండి టీడీపీలో పొలిటికల్‌ వార్‌.. నియోజకవర్గంలో ముదురుతున్న రాజు బ్రదర్స్‌ వర్గ పోరు..!

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో పొలిటికల్‌ వార్‌ నడుస్తోంది. ఎన్నికల్లో తనకు సహకరించాలని సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామరాజు మాజీ ఎమ్మెల్యే శివరామరాజును కోరారు. అయితే, టికెట్‌ రాకపోవడంతో నిరాశలో ఉన్న శివరామరాజు ఆయన విజ్ఞప్తిని తిరస్కరించినట్లు తెలుస్తోంది.

New Update
TDP: ఉండి టీడీపీలో పొలిటికల్‌ వార్‌.. నియోజకవర్గంలో ముదురుతున్న రాజు బ్రదర్స్‌ వర్గ పోరు..!

TDP Sivaramaraju V/s Ramaraju: ఏపీలో పొలిటికల్‌ వార్‌ నడుస్తోంది. టికెట్ దక్కిన వాళ్లు సంతోషంగా ప్రచారం చేస్తుండగా.. టికెట్ దక్కని నేతలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా పలుచోట్ల సీట్ల ఫైట్ జరుగుతోంది. తాజాగా, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. నియోజకవర్గంలో రాజు బ్రదర్స్‌ వర్గ పోరు ముదురుతోంది. ఇటీవల ఉండి అభ్యర్థిగా హైకమాండ్‌ రామరాజు పేరును ప్రకటించింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఆఫీసుకు వెళ్లారు సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామరాజు. ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరారు.

Also Read: రాడిసన్ డ్రగ్స్‌ కేసులో పెను సంచలనాలు.. నిందితుల లిస్ట్‌ లో స్టార్ డైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడి..!

అయితే, రామరాజు విజ్ఞప్తిని మాజీ ఎమ్మెల్యే శివరామరాజు తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు రామరాజు. కానీ, నా పర్మిషన్‌ లేకుండా నా ఆఫీసు వద్ద  ప్రెస్‌ మీట్‌ ఎందుకు పెడుతున్నావ్‌ అని  శివరామరాజు ప్రశ్నించారు. టికెట్‌ రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు తీవ్ర  నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: పెళ్ళయిన 3నెలలకే..హార్ట్ ఎటాక్‌తో చనిపోయిన భర్త..ఏడో అంతస్తు నుంచి దూకిన భార్య

తనకు టికెట్ రాకపోవడంతో టీడీపీ అధిష్ఠానం తనను మోసం చేసిందని వాపోయారు శివరామరాజు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాను అనేక సేవలు చేసినట్లు వ్యాఖ్యానించారు. 2019లో చంద్రబాబు అదేశాలు ప్రకారం తన సిట్టింగ్ స్ధానం ఉండి నియోజకవర్గాన్ని వదులుకున్నట్లు తెలిపారు. ఎన్నికలు చాలా దగ్గరగా వున్న సమయంలో నరసాపురం ఎంపీగా చంద్రబాబు వెళ్ళమంటే అధినేత నిర్ణయమే శిరోధార్యంగా భావించి వెళ్ళానని అన్నారు. ఎంపిగా పోటీ చేసి ఆర్థికంగా చాలా నష్టపోయానని కామెంట్స్ చేశారు. తన స్ధానం తనకు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఉండి నియోజకవర్గ స్ధానం తనకు ఇవ్వకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని హెచ్చరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు