TDP Ravikumar: మంత్రి ధర్మానకు కూన రవికుమార్ సవాల్.! మంత్రి ధర్మానపై మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ విమర్శలు గుప్పించారు. పేరులో ధర్మాన పెట్టుకొని అన్నీ అధర్మాలే మాట్లాడుతున్నారన్నారు. కమీషన్ల కోసం గత ప్రభుత్వం పనిచేసిందో లేదంటే వైసీపీ పనిచేసిందో తేల్చుకోవడానికి చర్చకు రావాలని సవాల్ విసిరారు. By Jyoshna Sappogula 05 Feb 2024 in శ్రీకాకుళం రాజకీయాలు New Update షేర్ చేయండి TDP Ravikumar: నదుల అనుసంధానంపై రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన, మాజీ ప్రభుత్వ విప్ కూన మధ్య మాటల యుద్దం నడుస్తోంది. గత టీడీపీ ప్రభుత్వం కేవలం కమీషన్ల కోసమే నదుల అనుసంధానం ప్రకియ ప్రారంభించిందన్నారు మంత్రి ధర్నాన. అయితే, ఈ వ్యాఖ్యలు కూన రవికుమార్ ఖండించారు. కమీషన్ల కోసం టీడీపీ పనిచేసిందో లేదంటే వైసీపీ పనిచేసిందో తేల్చుకోవడానికి బహిరంగంగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. పేరులో ధర్మాన పెట్టుకొని అన్నీ అధర్మాలే మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. Also Read: కేసీఆర్ జోలికొస్తే చెప్పుతో కొడతా.. బాల్క సుమన్ షాకింగ్ కామెంట్స్..! తాగు నీటికోసం కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం సాగునీటి కొసం ఒక్క పైసా వెచ్చించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రతిపాదించిన పనులు పూర్తి చేయడం ఇష్టం లేకనే చౌకబారు ఆరోపణలు చేస్తున్నారన్నారు. చేత కాని వారు చెప్పే ఖహానీలు ఇలానే వుంటాయని కామెంట్స్ చేశారు. కమీషన్ల కోసం పని చేసే ప్రభుత్వ అధికార పార్టీ వైసీపీ అని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నదుల అనుసంధానం ఎలా జరగదో చేసి చూపిస్తామని ధీమా వక్తం చేశారు. #andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి