Paritala Sriram: పరిటాల శ్రీరామ్‌ సీటుపై కొనసాగుతున్న సస్పెన్స్.. ధర్మవరం టికెట్ పై తీవ్ర ఉత్కంఠ..!

అనంతపురం జిల్లా ధర్మవరం సీటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీజేపీ అభ్యర్థి వరదాపురం సూరికి ఇస్తారా..లేదంటే టీడీపీ తరపున పరిటాల శ్రీరామ్‌కు ఇస్తారా అనే సస్పెన్స్‌ కొనసాగుతోంది. సీటు కోసం పార్టీ అధినేత చంద్రబాబును కలిసేందుకు పరిటాల శ్రీరామ్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
Paritala Sriram: పరిటాల శ్రీరామ్‌ సీటుపై కొనసాగుతున్న సస్పెన్స్.. ధర్మవరం టికెట్ పై తీవ్ర ఉత్కంఠ..!

Paritala Sriram MLA Ticket Suspense: ఏపీలో ఎన్నికల హాడావిడి మాములుగా లేదు. అధికార పార్టీ వైసీపీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు పెట్టుకున్న సంగతి తెలిసిందే. కూటమిలో భాగంగా ఇప్పటికే సీట్లు పంచుకున్నారు. 94 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసిన టీడీపీ రిసెంట్ గా 34 మందితో సెకండ్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. పొత్తులో భాగంగా జనసేనకు ముందుగా 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు కేటాయించిన.. తరువాత బీజేపీతో సీట్ల చర్చల్లో భాగంగా జనసేన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలకు పరిమితం అయింది. ఇక బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించింది.

Also Read: 50 సెకన్ల యాడ్‌ కోసం రూ. 5 కోట్లు వసూలు చేసిన లేడీ సూపర్‌ స్టార్‌!

అయితే, ఉమ్మడి కూటిమిలో భాగంగా పార్టీ పెద్దలు ఒకే మాట మీద ఉన్నప్పటికి అంతర్గంతగా మాత్రం పార్టీ నేతల్లో తీవ్ర అసహనం కనిపిస్తోంది. పలువురు నేతలు టికెట్ రాకపోవడంతో రాజీనామాలు చేసి వేరే పార్టీలోకి వెళ్తున్నారు. మరికొందరూ మాత్రం టికెట్ తనకంటే తనకంటూ వర్గ విభేదాలకు దిగుతున్నారు. ఇలా పలుచోట్ల టీడీపీ జనసేనలో ఇప్పటికి టికెట్ కోసం కొట్లాట జరుగుతోంది. ఇదిలా ఉండగా.. అనంతపురం జిల్లాలో ధర్మవరం సీటు ఎవరికనే దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.

Also Read: చరిత్రలో గామిని రికార్డ్.. 5 కాదు 6 పిల్లలకు జన్మనిచ్చిన చిరుత..!

పరిటాల శ్రీరామ్‌ సీటుపై ఇంకా సస్పెన్స్  నెలకొంది. రాప్తాడు నుంచి పరిటాల సునీతకు సీటు ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి, పరిటాల ఫ్యామిలీకి రెండో సీటు ఇస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. పరిటాల శ్రీరామ్‌ ధర్మవరం సీటు ఆశించారు. అయితే, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి కూడా సీటు ఆశిస్తున్నట్లు కనిపిస్తోంది. మరి బీజేపీ అభ్యర్థి వరదాపురం సూరికి టికెట్ ఇస్తారా? లేదంటే టీడీపీ తరపున పరిటాల శ్రీరామ్‌ పోటీ చేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే, సీటు కోసం మాత్రం పరిటాల శ్రీరామ్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబును కలిసేందుకు యత్నిస్తున్నారు. అంతేకాకుండా, పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ బీజేపీ పెద్దల్ని సైతం కలిసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు