TDP MLAs: అసెంబ్లీ సమావేశాలు ఇందుకే.. ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యేలు ఫైర్..!

అసెంబ్లీ సమావేశాలపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల, ఎమ్మెల్యే గోరంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై వాయిదా తీర్మానం ఇస్తే చర్చ జరగకుండా టీడీపీ సభ్యులను‌ సస్పెండ్ చేస్తున్నారన్నారు. ప్రభుత్వ గొప్పలు చెప్పుకోవడానికే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శలు గుప్పించారు.

New Update
TDP MLAs: అసెంబ్లీ సమావేశాలు ఇందుకే.. ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యేలు ఫైర్..!

TDP MLAs on Assembly Meetings: అసెంబ్లీలో ప్రతిపక్షం మాట్లాడకుండా నోరు నొక్కుతున్నారన్నారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu). ఆర్టీవీతో ఎక్స్ క్లూజీవ్ గా  మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలపై వైసీపీకి (YCP) చిత్తశుద్ధి లేదని విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ప్రారంభమయ్యే సమయానికి కూడా కోరం లేకపోవడం దుర్మార్గమన్నారు. ప్రజా సమస్యలపై వాయిదా తీర్మానం ఇస్తే చర్చ జరగకుండా టీడీపీ సభ్యులను‌ సస్పెండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: కడప జిల్లాలో వైసీపీ ఎంపీటీసీ భర్త దౌర్జన్యం.. టోల్‍గేట్ సిబ్బందిపై దాడి..!

అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వం తీరు నియంతలా ఉందని వ్యాఖ్యానించారు. రైతు సమస్యలపై వాయిదా తీర్మానంపై కూడా చర్చించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో రైతుల‌ క్రాప్ హాలిడే దేశానికి కూడా ప్రమాదమేనని చెప్పుకొచ్చారు. అసమర్ద పాలన ప్రజల్లోకి వెళ్తుందనే భయంతో అసెంబ్లీలో టీడీపీని మాట్లాడనివ్వకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రభుత్వ గొప్పలు చెప్పుకోవడానికే అన్నట్లుగా ఉందని మండిపడ్డారు.

Also Read: నీ అంతు చూస్తా.. ZPTCని ఫోన్ చేసి బెదిరించిన మంత్రి గుమ్మనూరు జరాయం సోదరుడు..!

ఈ క్రమంలోనే ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (MLA Butchaiah Chowdary) కూడా మాట్లాడారు. అసెంబ్లీలో ఉంటే నియంతపాలనలో ఉన్నట్లుగా ఉందని విమర్శించారు. ప్రతిపక్షాన్ని చూస్తే అధికాపార్టీకి భయం పట్టుకుందన్నారు. ఎన్నో ప్రభుత్వాలు చూశాను.. కానీ, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని కామెంట్స్ చేశారు. సభ్యులంటే కనీస గౌరవం కూడా లేదని మండిపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని సస్పెండ్ చెయ్యడానికి ప్రజలు‌ సిద్దంగా ఉన్నారని ఫైర్ అయ్యారు.

:<

Advertisment
Advertisment
తాజా కథనాలు