TDP MLA: వైసీపీపై ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆగ్రహం

ఏపీలో పలు ప్రాజెక్ట్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు సందర్శించిన విషయం తెలిసిందే. పలు ప్రాజెక్టు వద్ద వరద పరిస్థితి, జరుగుతున్న పనుల దృష్ట్యా ప్రజలకు వివరించారు. గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు ప్రాజెక్టు నిండి.. పరివాహక, దిగువ ప్రాంతాల్లో ప్రజల ప్రాణాలకు ఇబ్బందికి గురైయారు. ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల సందర్శపై అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

New Update
TDP MLA: వైసీపీపై ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆగ్రహం

ఏపీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు ఏడాది ఉంది. కానీ ముందే పొలిటికల్‌ హీట్‌ రోజురోజుకు పెరుగుతోంది. అధికార, ప్రతిపక్షాల పోటాపోటీ సభలు, సమావేశాలతో ఏపీ రాజకీయం రసవత్తరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే.. ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పేరుతో ఏపీ వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఆయా ప్రాంతాల్లోని స్థానిక రైతులు, నేతలతో కలిసి ప్రాజెక్ట్‌ట్లతో సహా పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించిన విషయం తెలిసిందే. ఈ మేరకు.. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు అనుమతి కోరుతూ ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శికి చంద్రబాబు లేఖ రాశారు. అయితే, ఈ లేఖల వ్యవహారం ఉత్కంఠ ఏపీలో రేపుతోంది.

ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు వరసగా వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పీఏసీ ఛైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఏపీ ప్రభుత్వంపై మరోసారి ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నాయకుడు ప్రాజెక్టుల సందర్శన కోసం పర్యటనలు చేస్తుంటే అధికార పార్టీ నేతలు భయపడి కేసు పెట్టడం దురాహంకార చర్య అని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నారు కాబట్టి భయపెట్టి పరిపాలన సాగిస్తున్నట్టు వైసీపీ తీరు ఉందన్నారు. ఇలాంటి పాలన ఎక్కవ కాలం చెల్లదన్నారు. హిట్లర్లు పోయారు, మహా-మహానియులేపోయారు. ప్రజాస్వామ్యంలో సీఎం జగన్‌ లాంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి నిరంకుశ విధానాలను అవలంబిస్తే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. చంద్రబాబు నాయుడు ఏంటో, ఆయన వ్యవహార శైలి ఏంటో, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందో 45 సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చూశారని అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు