TDP: టీడీపీ మాస్టర్ ప్లాన్.. ప్రజల్లోకి నారా భువనేశ్వరి, బ్రాహ్మణి..!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా ఊహించని మలుపులు తిరిగాయి. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఎన్నికలకు మరో 6నెలలు మాత్రమే ఉన్న నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

New Update
TDP: టీడీపీ మాస్టర్ ప్లాన్.. ప్రజల్లోకి నారా భువనేశ్వరి, బ్రాహ్మణి..!

TDP: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా ఊహించని మలుపులు తిరిగాయి. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఎన్నికలకు మరో 6నెలలు మాత్రమే ఉన్న నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. సాధారణంగా ఎలక్షన్స్‌ టైంలో ప్రతపక్షాలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వాలు దూరంగా ఉంటాయి. ఆ సమయంలో ఏమైనా చేస్తే ప్రజల్లో మంచి సానుభూతి వస్తుందని. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని పక్కనపెట్టి మరీ బాబు అరెస్టుకు రెడీ అయింది. దీంతో ప్రజల్లో సానుభూతి మరింత తెచ్చుకునే దిశగా టీడీపీ పెద్దలు పావులు కదుపుతున్నారు.

ప్రభుత్వ వేధింపులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా..

ప్రజల్లో సానుభూతి వస్తే ఎంతలా ఎఫెక్ట్ ఉంటుందో మనం కళ్లారా చూశాం. దివంగత సీఎం వైఎస్ మరణానంతరం వచ్చిన సానుభూతితోనే జగన్ సీఎం అయ్యారని అందరికి తెలిసిందే. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు కానీ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ ప్రజల్లో తిరిగి ఎంత సానుభూతి సంపాదించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అలాంటి సానుభూతినే తాము కూడా తెచ్చుకోవాలని టీడీపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు, లోకేష్‌లపై ప్రభుత్వం కక్షపూరితంగా వేధింపులకు పాల్పడుతుందని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలు రెడీ అయ్యారని చెబుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందించినట్లు పేర్కొంటున్నారు.

సానుభూతి పొందే దిశగా రూట్ మ్యాప్ సిద్ధం..?

శనివారం సీఐడీ చీఫ్‌ సంజయ్ మాట్లాడుతూ లోకేష్‌ పాత్రపైనా విచారణ జరుపుతామని.. అవసరమైతే అరెస్ట్ చేస్తామని పరోక్షంగా చెప్పారు. దీంతో భువనేశ్వరి, బ్రహ్మణి రంగంలోకి దిగనున్నట్లు వెల్లడిస్తున్నారు. ఒకవేళ లోకేష్ అరెస్ట్ అయితే ఆయన ఎక్కడ అయితే పాదయాత్ర ఆపారో.. అక్కడి నుంచి పాదయాత్ర చేయడమో.. లేదంటే రాష్ట్రవ్యాప్త పర్యటన చేసి ప్రభుత్వ వేధింపులను ప్రజల్లోకి తీసుకువెళ్లే దిశగా రూట్‌ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఇప్పుడుదివంగత సీఎం అన్న ఎన్టీఆర్ కూతురుగా, చంద్రబాబు భార్యగా భువనేశ్వరి.. ఎన్టీఆర్ మనవరాలిగా, బాలకృష్ణ కుమార్తెగా, చంద్రబాబు కోడలిగా బ్రాహ్మణి ప్రజల్లోకి వెళ్తే ఎక్కడ లేని సానుభూతి వస్తుందని భావిస్తున్నారట. ముఖ్యంగా మహిళల్లో వచ్చే సానుభూతి ఫలితాలను ఏకపక్షం చేస్తాయనే అంచనాలు వేసుకుంటున్నారట. మొత్తానికి ఏపీ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి.

ఇది కూడా చదవండి: ఏసీబీ కోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన చంద్రబాబు

Advertisment
Advertisment
తాజా కథనాలు