AP: అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోం.. టీడీపీ నాయకుల వార్నింగ్..! ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌పై అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఓ ఛానల్‌పై టీడీపీ నాయకులు ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అభివృద్ధిలో 20 సంవత్సరాలు వెనక్కి నెట్టి పాలన అందించిన మాజీ సీఎం జగన్ గురించి ప్రసారం చేయాలన్నారు. By Jyoshna Sappogula 10 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి Nellore: అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు ఓ ఛానల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వింజమూరు మండల కేంద్రంలోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. గత రెండు రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యేపై అసత్యపు కథనాలను ప్రచారం చేశారని మండిపడ్డారు. వింజమూరు మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ వైసీపీ నేతల్లో వారి ఛానల్లో మార్పు రాలేదన్నారు. కాకర్ల సురేష్ ఎమ్మెల్యేగా గెలుపొంది రెండు నెలలు కాకమునుపే అసత్య ప్రసారాలు చేస్తున్నారన్నారు. అవినీతి దుర్మార్గపు పాలన అందించి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అభివృద్ధిలో 20 సంవత్సరాలు వెనక్కి నెట్టి పాలన అందించిన మాజీ సీఎం జగన్ గురించి ప్రసారం చేయాలన్నారు. Also Read: గ్యాంగ్ సినిమా తరహాలో ఫుడ్ ఇన్ స్పెక్టర్లమంటూ రైడ్.. చివరికి ఏం జరిగిందంటే? రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. జైలు పక్షులను పరామర్శించే సంస్కృతి వైయస్ జగన్మోహన్ రెడ్డిది అని వారి నాయకత్వంలో పనిచేసే వైసీపీ నేతలకు కూడా అదే సంస్కృతి వచ్చిందన్నారు. ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో మైనింగ్ మట్టి ఇసుక దోపిడీ చేసిన నేతలు వాటి గురించి నీతులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉన్నాయన్నారు. వేలాది ఎకరాలు భూ కజ్జాలకు పాల్పడ్డారని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పై ఎలాంటి మచ్చ లేదని.. ఆయనపై బురద సల్లాలని అనుకుంటే చూస్తూ ఊరుకోమని తెలిపారు. ఎనిమిది మండలాలలో నాయకులు ఆరు నెలల తర్వాత జరిగిన అభివృద్ధిపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. కొంతమంది అధికారులు ఇప్పటికి కూడా వైసీపీ నేతలకు కొమ్ముకాస్తున్నారని వారందరి భరతం పడతామని తెలిపారు. #nellore #udayagiri మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి