/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/lokesh-tdp-jpg.webp)
Lokesh Yuvagalam Padayatra: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. టీడీపీ (TDP) పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. . జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర పది ఉమ్మడి జిల్లాల్లో 92 నియోజకవర్గాల మీదుగా సాగింది. ఇటీవల రెండో దశ పాదయాత్ర ప్రారంభించారు లోకేష్. తాజాగా యువగళం పాదయాత్ర 3000 కిలోమీటర్ల మైలు రాయిని చేరింది.
ALSO READ: Movierulz, iBOMMA లో సినిమాలు చూస్తున్నారా?.. తస్మాత్ జాగ్రత్త!
ఈ క్రమంలో లోకేష్ ట్విట్టర్ లో..'యువగళం పాదయాత్ర 219వరోజు తుని నియోజకవర్గం తేటగుంట వద్ద 3వేల కి.మీ. మైలురాయికి చేరుకుంది. ఈ చారిత్రాత్మక మజిలీకి గుర్తుగా వైకాపా సర్కారుమూసేసిన అన్నాక్యాంటీన్లు మళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించాను. ప్రత్యేకమైన ఈ రోజు బ్రాహ్మణి, దేవాన్ష్, మోక్షజ్ఞ నాతోపాటు అడుగులు వేశారు. తుని పట్టణంలో అశేష ప్రజానీకం నా వెంట నడిచింది. తాండవబ్రిడ్జి వద్ద ఉత్తరాంధ్రలోకి అడుగు పెట్టిన పాదయాత్రకు ఘనస్వాగతం లభించింది.' అంటూ రాసుకొచ్చారు.
యువగళం పాదయాత్ర 219వరోజు తుని నియోజకవర్గం తేటగుంట వద్ద 3వేల కి.మీ. మైలురాయికి చేరుకుంది. ఈ చారిత్రాత్మక మజిలీకి గుర్తుగా వైకాపా సర్కారుమూసేసిన అన్నాక్యాంటీన్లు మళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించాను. ప్రత్యేకమైన ఈ రోజు బ్రాహ్మణి, దేవాన్ష్, మోక్షజ్ఞ… pic.twitter.com/ST5oAu0zwp
— Lokesh Nara (@naralokesh) December 11, 2023
అంగన్వాడీల ఉద్యమానికి టీడీపీ సంపూర్ణ మద్దతు: లోకేష్
అందరినీ చేసినట్లే.. జగన్ అంగన్వాడీలను మోసం చేశారని ఫైర్ అయ్యారు టీడీపీ నేత నారా లోకేష్. పనికి తగ్గ వేతనం ఇస్తానని జగన్ (CM Jagan) మాట తప్పారని మండిపడ్డారు. పక్క రాష్ట్రాల కంటే ఎక్కువ జీతం హామీపైనా మడమ తిప్పారని ఆరోపించారు. అంగన్వాడీలపై విపరీతమైన పని ఒత్తిడి పెంచేశారని పేర్కొన్నారు. అంగన్వాడీల ఉద్యమానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని అన్నారు.
అందరినీ మోసం చేసినట్టే, అంగన్ వాడీ వర్కర్లను జగన్ మోసం చేశాడు. పనికితగ్గ వేతనం మాట తప్పాడు. పక్కరాష్ట్రాల కంటే ఎక్కువ జీతం హామీపైనా మడమ తిప్పాడు. విపరీతమైన పనిఒత్తిడి పెంచేశాడు. గత్యంతరం లేని స్థితిలో వేతనాల పెంపు, గ్రాట్యుటీ డిమాండ్ల సాధనకి నిరసన బాట ప… pic.twitter.com/42L4YvpjJg
— Lokesh Nara (@naralokesh) December 12, 2023