Lokesh: ఉద్యోగాల నోటిఫికేషన్ వయోపరిమితి పెంచండి.. జగన్ కు లోకేష్ లేఖ

సీఎం జగన్ కు లేఖ రాశారు టీడీపీ నేత లోకేష్. తెలంగాణలో మాదిరే ఏపీలో కూడా గ్రూప్ ఉద్యోగాల నోటిఫికేషన్ వయోపరిమితి 44 ఏండ్లకు పెంచాలని లేఖలో కోరారు. యువతకు ఉద్యోగావకాశాలు కలిపించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

New Update
Lokesh: నీ హెచ్చరికకు భయపడేది లేదు.. జగన్‌పై మంత్రి లోకేష్ ఫైర్

TDP Lokesh : గ్రూప్ ఉద్యోగాల నోటిఫికేషన్ వయోపరిమితి పెంచాలంటూ సీఎం జగన్ కు(CM Jagan) లేఖ రాశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Lokesh). వార్షిక జాబ్ క్యాలెండర్ జారీ చేయటంలో ప్రభుత్వం విఫలమైనందున తాజా నోటిఫికేషన్ గరిష్ట వయోపరిమితిని 44ఏళ్లకు పొడిగించాలని లేఖలో డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలైన విధానాన్ని ఏపీలోనూ అమలు చేయాలని సీఎంకు లోకేష్ హితవు పలికారు.

2019 నుంచి వార్షిక ఉద్యోగ క్యాలెండర్‌ (Job Notification) విడుదల చేయటంలో ప్రభుత్వం విఫలమవుతూ రావటం దురదృష్టకరమని అన్నారు. ఎన్నికల్లో వైసీపీ పార్టీ (YCP Party) నిరుద్యోగ యువతకు తప్పుడు వాగ్ధానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిందని ధ్వజమెత్తారు. గుడ్డిగా అసత్య వాగ్ధానాలు నమ్మి విశ్వసించిన యువత ఆశలపై అధికారంలోకి వచ్చాక కోలుకోలేని దెబ్బకొట్టారని మండిపడ్డారు.

ALSO READ: బర్రెలక్కకు వచ్చిన ఓట్లు పవన్ కు రాలేదు.. సీఎం జగన్ సెటైర్లు!

గత నాలుగన్నరేళ్లుగా వార్షిక ఉద్యోగ క్యాలెండర్ (Job Calender) లేక మోసపోయిన యువత ఎన్నో బాధలు అనుభవించారు అని లేఖలో పేర్కొన్నారు. నాలుగున్నరేళ్ల ప్రభుత్వ నిర్లక్ష్యం యువత భవితను నాశనం చేసిందని ఫైర్ అయ్యారు. ఎన్నికలు దగ్గరపడుతున్నందున అకస్మాత్తుగా నిద్ర మేల్కొని వైసీపీ పాలకులు గ్రూప్ నోటిఫికేషన్ల పేరుతో మరో వంచనకు సిద్ధమయ్యారని విమర్శించారు.

ALSO READ: జగన్ కు షాక్.. వైసీపీలో మొదలైన అసమ్మతి

ఎన్నికల కోసం జారీ చేసిన తాజా గ్రూప్-1 (Group-1), గ్రూప్-2 (Group-2) ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఎంతో మంది నిరుద్యోగ యువత అశలపై నీళ్లుచల్లుతోందని పేర్కొన్నారు. నోటిఫికేషన్‌ల దరఖాస్తుకు ఎంతో మంది నిరుద్యోగ యువత అనర్హులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా.. వయో పరిమితి నిబంధన కారణంగా దరఖాస్తు చేసుకోలేని యువతకు సడలింపు ఇవ్వాలని సీఎం జగన్ ను కోరారు. తెలంగాణ రాష్ట్రం తరహాలో గరిష్ట వయోపరిమితిని కనీసం 44 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర యువతకు మీరు చేసిన మోసానికి పరిహారంగా అయినా వయోపరిమితి పెంచాలని అన్నారు.

Lokesh letter to CM Jagan

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Lady Aghori- Mark Shankar: పవన్ నీ కొడుకు కోసం పూజలు చేస్తున్నా- అఘోరీ సంచలన వీడియో

పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని లేడీ అఘోరీ ప్రార్థిస్తున్నట్లు తెలిపింది. అతడి కోసం పూజలు చేస్తున్నానని పేర్కొంది. పిల్లలందరిపై శివయ్య ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పింది. నా వంతు నేను కృషి చేస్తానని ఓ వీడియో రిలీజ్ చేసింది.

New Update


ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కి సింగపూర్‌ స్కూల్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం గురించి తెలిసిన తర్వాత ఎంతో మంది ప్రముఖులు స్పందించారు. చిరంజీవి, కేటీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్ తదితరులు రియాక్ట్ అయ్యారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని వారు దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన లేడీ అఘోరీ పవన్ కుమారుడి ప్రమాదంపై స్పందించింది. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసింది. 

Also Read: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

త్వరగా కోలుకోవాలి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను. మార్క్ శంకర్ తో పాటు మరెంతో మంది చిన్న పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ గాయాల నుంచి కూడా మిగతా పిల్లలు కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలందరిపై కాళిమాత ఆశిస్సులు, శివయ్య ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయి. 

Also Read: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

ఈ ప్రమాదంలో గాయపడిన పవన్ కుమారుడి గురించి తాను స్పందించడం వెనుక ఒక కారణం ఉంది. పవన్ కళ్యాణ్ ఎక్కువగా సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు. అందుకే నేను స్పందిస్తున్నాను. దీనిని రాజకీయ కోణంలో చూడకండి. రాజకీయ బురద చల్లకండి. సనాతన ధర్మం గురించి ఎవరు పోరాడినా నేను స్పందిస్తాను. వాళ్ల కుటుంబాలకు ఏమైనా నేను స్పందించి రక్షిస్తాను. 

Also Read: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

పవన్ కళ్యాణ్ గారు మీరేం బాధపడకండి. మళ్లీ మీ కుమారుడు హ్యాపీగా నవ్వుతూ మీతో ఆడుకుంటాడు. మీరు సరదాగా మీ కుమారుడితో సమయాన్ని గడిపే రోజులు వస్తాయి. నా వంతు నేను కృషి చేస్తాను. పూజలో కూర్చోబోతున్నాను. మీరేం బాధపడకండి. మీరు సనాతన ధర్మం గురించి పోరాడండి. 

Also Read:  చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

(lady aghori | Pawan Kalyan | pawan kalyan son mark shankar | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment