AP Politics: బండారుపై రోజా సీరియస్ యాక్షన్.. కీలక నిర్ణయం తీసుకున్న మంత్రి

బండారు వ్యాఖ్యలపై మంత్రి రోజా మరోసారి ఫైర్‌ అయ్యారు. న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళ్తా.. న్యాయపరంగా పోరాడతానని మంత్రి తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ బండారు లాంటి చీడపురుగులను ఏరిపారేయాలంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను ఒకమాట అనాలంటే భయపడే పరిస్థితి వస్తుందన్నారు.

New Update
AP Politics: బండారుపై రోజా సీరియస్ యాక్షన్.. కీలక నిర్ణయం తీసుకున్న మంత్రి

Roja Warning to Bandaru Satyanarayana: టీడీపీ, జనసేనపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబు తప్పుచేసి సాక్ష్యాలతో దొరికిపోయాడని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైల్‌ కెళ్లడంతో టీడీపీ నేతలకు పిచ్చెక్కిందన్నారు. మీ నాయకుడు తప్పుచేయలేదని ప్రూవ్ చేసుకోకుండా..!! మా మీద పడి ఏడిస్తే ఏం లాభం రోజా విమర్శలు చేశారు. చంద్రబాబు కోసం పెద్దపెద్ద లాయర్లు ఢిల్లీ నుంచి దిగారు. చంద్రబాబు తప్పు చేయకపోతే.. ఎందుకు బయటకు తీసుకురాలేకపోతున్నారని ప్రశ్నించారు. టీడీపీ ఫెయిల్యూర్‌ను డైవర్ట్ చేయడానికి నన్ను టార్గెట్ చేశారని మంత్రి రోజా ఆరోపించారు. మాజీ మంత్రిగా చేసిన బండారు చాలా నీచంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు ఊహతెలిసినంతవరకూ ఎవరూ ఇంతలా ఒక మహిళ గురించి మాట్లాడలేదన్నారు.

తన నియోజకవర్గంలో ఉన్న మహిళలకు.. తన ఇంట్లో ఉన్న మహిళలకు ఎలాంటి గౌరవమిస్తాడో అర్ధమైందన్నారు. మహిళల పట్ల బండారుకు ఉన్న సంస్కారమేంటో ప్రజలు తెలుస్తోందని రోజా కితబు పలికారు. మంత్రిగా ఉన్న రోజాని అంటే తప్పించుకు తిరగొచ్చని బండారు అనుకుంటున్నారు..బండారు వంటి మగవాళ్లకు బుద్ధి చెప్పడానికే నేను పోరాటం చేస్తున్నాం అని సవాల్‌ చేశారు. అరెస్ట్ చేసి బెయిల్ వస్తే బండారు తప్పు చేయనట్లు కాదన్నారు. బండారు చేసిన వ్యాఖ్యల వల్ల మేం చాలా అవమాన పడ్డాం.. చట్టాల్లో మార్పు రావాలి బండారు సత్యనారాయణ వంటి చీడపురుగులను ఏరిపారేయాలని రోజా డిమాండ్‌ చేశారు. ఏ మహిళను కించపరచాలన్నా భయపడేలా చేస్తామని సవాల్‌ చేశారు. మహిళ మీద నింద వేస్తే చచ్చే వరకూ అవమానం భరించాలా..? నాపై బురద జల్లాలని చూసినా నేను పోరాడతానని మంత్రి రోజా వెల్లడించారు. సామాన్య మహిళకు ఇలాంటి పరిస్థితి వస్తే ఏంటి..? న్యాయపరంగా పోరాడుతా...సుప్రీంకోర్టుకు వెళ్తానిని రోజా తెలిపారు. టీడీపీ, జనసేన ఉన్నది దిగజారుడు రాజకీయాలు చేయడానికే ఉన్నారని మండిపడ్డారు. మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్న వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని వైసీపీ మంత్రి రోజా మండిపడ్డారు.

రోజాకు పెరుగుతున్న మద్దతు

మాజీ మంత్రిగా పని చేసిన బండారు చాలా నీచంగా మాట్లాడిన విషయం తెలిసిందే. మహిళల పట్ల బండారుకు ఉన్న సంస్కారమేంటో తెలుస్తోందన్నారు.  మరోవైపు బండారు చేసిన వ్యాఖ్యలపై నటీమణులు తీవ్రంగా స్పందిస్తున్న విషయం తెలిసిందే. రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలైన వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాపైన బండారు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి నవనీత్ కౌర్, రాధిక, ఖుష్బూ, మీనా, రమ్యకృష్ణ, శరత్‌కుమార్‌ టీడీపీ నేత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బండారుని వదిలిపెట్టేది లేదని మంత్రి రోజా వార్నింగ్ ఇచ్చారు. బండారు చేసిన వ్యాఖ్యలు ఎంతో బాధిస్తున్నాయని రోజా చెప్పుకొచ్చారు. ఒకమనిషి చనిపోతే కొన్ని రోజులే బాధపడతారు. కానీ.. తాను ఈ నిందలను జీవితాంతం భరించాల్సిందేనా అని ఆవేదన వ్యక్తం చేశారు. క్రిమినల్ డిఫమేషన్, సివిల్ డిఫమేషన్ దాఖలు చేస్తా.. సుప్రీంకోర్టులో కూడా పోరాటం చేస్తానని మంత్రి రోజా స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: ఏపీలో నకిలీ పత్రాలు కలకలం.. కార్పొరేషన్ అధికారుల పేరుతో ఏం చేశారంటే..?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో రాబోయే 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

New Update
Rains

Rains

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రాబోయే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు వర్ష సూచన ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment