Actress Meena: ఆ హక్కు బండారుకు ఎవరిచ్చారు..? రోజాకు అండగా నటి మీనా సంచలన వ్యాఖ్యలు వైసీపీ మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సినీనటులు రోజాకు మద్దతు తెలుపుతున్నారు. అంతేకాకుండా బండారుపై కొంతమంది సినీ తారలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వెంటనే మంత్రి రోజాకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. By Vijaya Nimma 08 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Actress Meena Fires On Bandaru Satyanarayana: మంత్రి రోజా (Minister Roja) పై టీడీపీ నేత బండారు నీచమైన వ్యాఖ్యలు చేశారని సినీ నటి మీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బండారు సత్యనారాయణ మూర్తి తక్షణమే మంత్రి రోజాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలుపై స్పందించి చర్యలు తీసుకోవాలని మీనా డిమాండ్ చేశారు. బండారు ఎంత దిగజారుడు మనస్తత్వం ఉన్నవాడో అర్థమయ్యేలా ఉన్నాయని ద్వజమెత్తారు. అతని అభద్రత భావం, అసూయకి నిదర్శనం అన్నారు. మంత్రి రోజా సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు తెలుసు అన్నారు. ఆమెతో కలిసి నటించిన వ్యక్తిగా.. ఆమె కోసం నాకు పూర్తిగా తెలుసు అన్నారు. Your browser does not support the video tag. రోజా చాలా చిత్తశుద్ధితో హార్డ్ వర్క్ చేసే దృఢమైన మహిళ అని మీనా వ్యాఖ్యనించారు. రోజా నటిగా, తల్లిగా, రాజకీయ నాయకురాలిగా, మహిళగా అన్నింటిలోనూ సక్సెస్ అయిన వ్యక్తి అని పొగిడారు. ఆమెను ఇలా నీచంగా మాట్లాడితే భయపడుతుంది అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. మంత్రి రోజా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడే హక్కు బండారుకి ఎవరిచ్చారు..? అని తప్పుబట్టారు. ఇలా మాట్లాడినంత మాత్రాన మహిళలు భయపడి పోతారు అనుకుంటున్నవా..? అంటూ తాజాగా నటి మీనా ఓ వీడియోలో విడుదల చేశారు.. మంత్రి రోజాకు నేను అండగా ఉంటానని సినీ నటి మీనా హామీ ఇచ్చారు. ఓ మహిళా మంత్రిని ఇంత దారుణంగా.. బండారు చేసిన వ్యాఖ్యల పట్ల మరో సినీ నటి రమ్యకృష్ణ (Ramya Krishna) కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజాని బండారు అసభ్యకరంగా దూషించడం దారుణమని అన్నారు. బండారు చేసిన వ్యాఖ్యలని క్షమించకూడదని ఆమె ఫైర్ అయ్యారు. మన దేశంలో మాత్రమే భారత మాతకీ జై అని గర్వంగా చెప్తామని.. అలాంటి దేశంలో ఓ మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా..? అంటూ ఫైర్ అయ్యారు. ప్రపంచంలోనే ఐదో అత్యుత్తమ ఆర్థిక దేశంగా మన దేశం అవతరిస్తోందన్నారు. అలాంటి దేశంలో ఓ మహిళా మంత్రిని ఇంత దారుణంగా మాట్లాడతారా..? అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సాటి మహిళగా, స్నేహితురాలిగా మంత్రి రోజాకి అండగా ఉంటానని సినీ నటి రమ్యకృష్ణ అన్నారు. బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు స్పందించాలి కాగా.. మంత్రి రోజాకు అలనాటి తారల నుంచి మద్దతు పెరుగుతూ ఉంది. టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి ఆమెను అభ్యంతరకర రీతిలో దూషించిన విషయంలో ఇప్పటికే సినీ నటులు శరత్ కుమార్, ఖుష్బు (Kushboo), రాధిక (Radhika) స్పందించగా.. తాజాగా మరో నటి మీనా, రమ్యకృష్ణ కూడా స్పందించారు. రోజాపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన బండారు వెంటనే మంత్రి రోజాకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. బండారు చేసిన ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందించి.. చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు కోసం కృష్ణమ్మకు టీడీపీ నేతల సారె #minister-roja #comments #bandaru-satyanarayana #movie-actress-meena #tdp-leader-bandaru #actress-meena-fires-on-bandaru-satyanarayana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి