Sajjala Bhargav Reddy: సజ్జలకు బిగ్ షాక్.. ఈసీ కీలక ఆదేశాలు AP: సజ్జల భార్గవ రెడ్డిపై సీఐడీ విచారణకు ఎన్నికల సంఘం ఆదేశం ఇచ్చింది. సోషల్ మీడియాలో చంద్రబాబుపై తప్పుడు ప్రచారంపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఇంటింటికీ పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబే కారణమని ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. By V.J Reddy 05 May 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Sajjala Bhargav Reddy: సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఎన్నికల సంఘం ఆదేశం ఇచ్చింది. సోషల్ మీడియాలో చంద్రబాబుపై తప్పుడు ప్రచారంపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఇంటింటికీ పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబే కారణమని ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ భార్గవరెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేశారని ఫిర్యాదు చేసింది. ఐవీఆర్ఎస్ ద్వారా ఓటర్లు, పింఛను దారులను తప్పుదోవ పట్టించారని.. విద్వేషాలు రగిల్చేలా తప్పుడు ప్రచారం చేశారని భార్గవరెడ్డిపై వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ALSO READ: కాంగ్రెస్ నేత మధు యాష్కీకి తప్పిన ప్రమాదం ఏ1గా చంద్రబాబు, ఏ2గా లోకేష్... ల్యాండ్ టైటిలింగ్ చట్టం(Land Titling Act) పై ఐవీఆర్‌ఎస్ కాల్స్‌తో టీడీపీ తప్పుడు ప్రచారం చేసిందినే ఆరోపణలు వచ్చాయి. వైసీపీ ఫిర్యాదు మేరకు అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌తో పాటు 10 మందిపై కేసు నమోదైంది. ఏ1గా చంద్రబాబు, ఏ2గా లోకేష్ పేరును చేర్చారు. అలాగే IVRS కాల్స్(IVRS Calls) చేసిన ఏజెన్సీ పైనా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఐడీ ఈరోజు చంద్రబాబు, లోకేష్ లను విచారించింది. #chandrababu #cm-jagan #election-commission #sajjala-bhargav-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి