గోదావరిని అడ్డు పెట్టుకుని కోట్లు దోచేస్తున్నారు.... బుచ్చయ్య చౌదరి ఫైర్...!

గోదావరిని అడ్డు పెట్టుకుని కోట్ల రూపాయలను దొచేస్తున్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ ప్రభుత్వం ఇసుక విధానంలో దళితులు, బలహీన వర్గాల పొట్టకొట్టిందన్నారు. రాజమండ్రిలో ఇసుక ర్యాంపు వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ఇసుక మాఫియా పై సత్య గ్రహ ధర్నా చేపట్టారు. ఈ సత్యాగ్రహ దీక్షలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు.

New Update
గోదావరిని అడ్డు పెట్టుకుని కోట్లు దోచేస్తున్నారు.... బుచ్చయ్య చౌదరి ఫైర్...!

గోదావరిని అడ్డు పెట్టుకుని కోట్ల రూపాయలను దొచేస్తున్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ ప్రభుత్వం ఇసుక విధానంలో దళితులు, బలహీన వర్గాల పొట్టకొట్టిందన్నారు. రాజమండ్రిలో ఇసుక ర్యాంపు వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ఇసుక మాఫియా పై సత్య గ్రహ ధర్నా చేపట్టారు. ఈ సత్యాగ్రహ దీక్షలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు.

ప్రభుత్వం అక్రమంగా తవ్వెస్తున్న ఇసుక మాఫియాపై సత్యా గ్రహ ధర్నాలు చేపట్టామన్నారు. రాత్రి సమయాల్లో యథేచ్ఛగా ఇసుకను తవ్వెస్తున్నారని ఫైర్ అయ్యారు. పాత హక్కుల పేరుతో జేపీ గ్రూపునకు సంబందం లేకున్నా అడ్డగోలుగా బిల్లులు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. ఇష్టాను సారంగా ఎక్కడపడితే అక్కడ ఇసుకను గుట్టలుగా వేసేశారని తీవ్రంగా ఫైర్ అయ్యారు.

ఈ నాలుగేళ్లలో పది లక్షల కోట్ల విలువైన ఇసుకను తవ్వేశారని ఆరోపించారు. తక్షణమే ఇసుక దోపిడీ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అక్రమ ఇసుక తవ్వకాలపై కేంద్రం వెంటనే సీబీఐ ఎంక్వైరీ వెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఇసుక డంపింగ్ యార్డ్‌ల వద్ద టీడీపీ నేతలు సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు. పీ గన్నవరం మండలం చాకలిపాలెంలో ఇసుక దోపిడీపై టీడీపీ నేతలు సత్యాగ్రహ దీక్షకు దిగారు.

విచ్చలవిడిగా ఇసుక డంప్ చేసి దోపిడీ చేస్తున్నారని అమలాపురం మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. వైసీపీ ప్రభుత్వం, ఎమ్మెల్యేలు ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకుని కోట్లు దోచుకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో 300 పైగా ఉన్న ఇసుక రీచ్ ల్లో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తిన్నారో వాటన్నింటినీ కక్కిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇసుక దోపిడీ పై టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే విచారణ జరిపిస్తామన్నారు.

మరోవైపు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మైలవరంలో ఇసుక డంపింగ్ స్టాక్ పాయింట్ వద్ద తెదేపా నేతలతో మాజీ మంత్రి దేవినేని ఉమా, తిరువూరు నియోజకవర్గ ఇంఛార్జ్ శావల దేవదత్ నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది.

అటు శ్రీకాకుళంలో ఇసుక సత్యాగ్రహంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నాయకుల ప్రసంగాలకు ఎస్ఐ శ్రీనివాసు అడ్డుకున్నారు. అనుమతలు ఉన్నాయని జేపీ సిబ్బంది తో మాట్లాడించే ప్రయత్నం చేశారు. మేలో జేపీ సంస్థ గడువు పూర్తయితే ఎలా రవాణా చేస్తున్నారని మండలి బుద్ధప్రసాద్ ప్రశ్నించారు. ప్రశాంతంగా నడుస్తున్న నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తతలు తీసుకువచ్చేలా ఎస్ఐ వ్యవహరించారని మాజీ ఎంపీ కొనకళ్ల మండిపడ్డారు.

గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలపై పోలీసుల ఆంక్షలు విధించారు. ఇసుక రీచ్‍ల వద్ద టీడీపీ ఆందోళనల నేపధ్యంలో టీడీపీ నేతలను పోలీసలు హౌస్ అరెస్ట్ చేశారు.గుంటూరులో పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఇంటివద్ద పోలీసుల పహారా కాశారు.జిల్లా టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pawan: పవన్ ఇలాకా పిఠాపురంలో దారుణం.. దళితుల గ్రామ బహిష్కరణ.. పరిహారం అడగడమే పాపమా?

పవన్ ఇలాకా పిఠాపురం మల్లంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో పనిచేస్తూ కరెంట్ షాక్‌తో పల్లపు సురేష్ చనిపోయాడు. దీంతో న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగిన దళితులను అగ్రవర్ణ పెద్దలు గ్రామ బహిష్కరణ చేశారు. టిఫిన్, కిరాణ షాపు సరుకులు కూడా ఇవ్వట్లేదు.

New Update

Pawa Kalyan: ఏపీ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అగ్ర వర్ణాలు దళితులను గ్రామం నుంచి బహిష్కరించడం కలకలం రేపుతోంది. వస్తువులను విక్రయించరాదంటూ హుకుం జారీ చేయడంతో దుకాణదారులు అమ్మకాలు నిలిపివేశారు. ఓ ఇంటి దగ్గర విద్యుత్ పని చేస్తూ షాక్ తగిలి పల్లపు సురేష్ అనే వ్యక్తి చనిపోయాడు. దీంతో మృతుడి కుటుంబసభ్యులు, దళితులు బాధితుడి కుటంబానికి న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. దీంతో గ్రామం నుంచి బహిష్కరించారని దళితులు ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇది కూడా చూడండి: Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలు-2025.. సర్కార్ ప్రత్యేక యాప్‌..ఒక్క క్లిక్ చాలు!

రంగంలోకి దిగిన ఆర్డీవో..

ఈనెల 16న అగ్రవర్ణానికి చెందిన వారి ఇంటి కరెంటు పనిచేస్తూ షాక్ తో పల్లపు సురేష్ చనిపోయాడు. సురేష్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ మల్లం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులు ధర్నా చేశారు. నష్టపరిహారంగా సుమారు రూ. 2 లక్షల 75 వేల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించారు. కానీ తాము చేయని తప్పుకి నష్టపరిహారం ఎందుకు చెల్లించాలంటూ అగ్రవర్ణాల పెద్దలు వాదనకు దిగారు. దీంతో దళితులను దూరం పెట్టాలని నిర్ణయించగా.. వస్తువులను విక్రయించరాదంటూ అగ్రవర్ణాలు తీర్మానించాయి. ఆదేశాలు పాటించని వారిపై కూడా చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ ఇష్యూ మరింత ముదరడంతో పోలీసులు ఇరువర్గాలతో చర్చలు జరిపారు. స్వయంగా ఆర్డీవో రంగంలోకి దిగి దళితులు, అగ్రవర్ణాల వాదనలు విన్నారు. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చినట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: Paster praveen: పోలీసులకు వ్యతిరేకంగా KA పాల్ అనుమానాలు.. ఆర్టీవీతో ఎక్స్‌క్లూసివ్ వీడియో

pitapuram | dalith | village | issue | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment