Chandrababu: ఢిల్లీకి చంద్రబాబు.. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు?

టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ ఆయన బీజేపీ నేతలతో భేటీ కానున్నారు. ఏపీలో టీడీపీ, బీజేపీ పొత్తుపై వారితో చర్చలు జరపనునట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత పొత్తులపై క్లారిటీ రానుంది.

New Update
Andhra Pradesh: త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ - సీఎం చంద్రబాబు నాయుడు

TDP Chief Chandrababu Delhi Tour: మరికొన్ని నెలల్లో ఏపీలో అసెంబ్లీ (AP Assembly Elections) ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) జరగనున్నాయి. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలో ఏపీలో తమ పార్టీ జెండా ఎగురవేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రేపు రాత్రి ఢిల్లీకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. పొత్తులపై చంద్రబాబుతో బీజేపీ (BJP) పెద్దలు చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఎనిమిదో తేదీన మరోసారి భేటీ కావాలని పవన్‌- చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్‌ (Pawan Kalyan) కూడా ఢిల్లీ వెళ్లే ఛాన్స్‌ ఉన్న్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు హస్తిన పర్యటన తర్వాత పొత్తులపై క్లారిటీ రానుంది.

ALSO READ: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. గ్రూప్-1 పోస్టులు పెంపు

ఇంకా పంచాయతీ ఓడవలేదు..

టీడీపీ, జనసేన (TDP-Janasena) మధ్య సీట్ల లెక్క తేలడం లేదు. చంద్రబాబు, పవన్‌ ఓకే అనుకున్నా గ్రౌండ్‌ లెవల్‌లో తీవ్ర పోటీ నెలకొంది. దాదాపు 35 నుంచి 40 సీట్లలో టీడీపీ, జనసేన మధ్య పోటీ ఉంది. తామే పోటీ చేస్తామని ఇరు పార్టీ నేతల పట్టు పడుతున్నారు. ఏ జిల్లాల్లో పోటీ ఉందో కింద చూడండి.

—> శ్రీకాకుళం జిల్లా : పాతపట్నం, ఎచ్చెర్ల, పలాస
—> తూ.గో.జిల్లా : రాజమండ్రి రూరల్‌, కాకినాడ రూరల్‌, కాకినాడ టౌన్‌…
—> తూ.గో.జిల్లా : పిఠాపురం, ముమ్మడివరం, అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం
—> ప.గో.జిల్లా : తాడేపల్లిగూడెం, నరసాపురం, తణుకు, ఉంగుటూరు, ఏలూరు
—> కృష్ణాజిల్లా : పెడన, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్‌, విజయవాడ ఈస్ట్‌
—> గుంటూరు జిల్లా : తెనాలి, గుంటూరు వెస్ట్‌
—> ప్రకాశం జిల్లా : చీరాల, దర్శి
—> నెల్లూరు జిల్లా : నెల్లూరు సిటీ, కోవూరు
—> కర్నూలు జిల్లా : ఆళ్లగడ్డ, ఆదోని
—> కడప జిల్లా : కడప సిటీ, రాజంపేట
—> అనంతపురం జిల్లా : అనంతపురం, ధర్మవరం
—> చిత్తూరు జిల్లా : జీడీ నెల్లూరు, మదనపల్లె, చిత్తూరు, శ్రీకాళహస్తి, తిరుపతి 

ఇక పవన్‌ పార్టీకి 25 అసెంబ్లీ సీట్లు, మూడు లోక్ సభ సీట్లు కేటాయించాలని టీడీపీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గత నెల చంద్రబాబు, పవన్ ఈ రెండు అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్థులను ఏకపక్షంగా ప్రకటించారు. అరకు, మండపేట నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుందని చంద్రబాబు ఖరారు చేయడంతో రాజానగరం, రాజోలు నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. దీంతో ఇరు పార్టీల మధ్య చిచ్చు రేగింది.

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు