TDP Chief Chandrababu: చంద్రబాబు కీలక ప్రకటన వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం అని అన్నారు. వాలంటీర్లను రాజీనామా చేయాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. వారు రాజీనామా చేయాల్సిన పని లేదని అన్నారు. By V.J Reddy 05 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి TDP Chief Chandrababu: వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం అని అన్నారు. వాలంటీర్లను రాజీనామా చేయాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. వారు రాజీనామా చేయాల్సిన పని లేదని అన్నారు. డోర్ డెలివరీ ఇవ్వొద్దని ఈసీ ఎక్కడా చెప్పలేదని అన్నారు. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వాలంటీర్లను ఉపయోగించుకొని లబ్ధి పొందాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందుగానే డబ్బులు డ్రా చేసి పెట్టుకోవాలి కదా అని విమర్శించారు. ALSO READ: అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడికి ఈసీ షాక్ తండ్రి సెంటిమెంట్.. పింఛన్లపై ప్రజలను ఇబ్బంది పెట్టి తప్పుడు సమాచారం ఇవ్వడం దారుణం అని అన్నారు చంద్రబాబు. మనం చేసే పనుల వల్ల ఓట్లు అడగాలని పిలుపునిచ్చారు. ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి బెదిరించడం దారుణం అని పేర్కొన్నారు. శవరాజకీయాలు మానుకోవాలని సీఎం జగన్ కు సలహా ఇచ్చారు. తండ్రి చనిపోతే రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారని ఆరోపించారు. బాబాయ్‌ని చంపేసి మళ్లీ దండేసి సానుభూతి పొందారని విమర్శించారు. కుట్రలో అధికారులు భాగస్వామ్యం కావడం దుర్మార్గం అని అన్నారు. ఓడిపోతామని తెలిసి రూ.13 వేల కోట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు సీఎం జగన్ అని సంచలన ఆరోపణలు చేశారు. #cm-jagan #ap-elctions-2024 #tdp-chief-chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి