'మీ అరాచకాలను కాల్ రికార్డింగ్ తో సహా బయటపెడతా' ఎమ్మెల్యే కు అఖిల ప్రియ వార్నింగ్

ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డిపై మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చేసే అరాచకాలను కాల్ రికార్డింగ్ తో సహా అందరి జాతకాలు తొందర్లోనే బయటపెడతా అంటూ హెచ్చరించారు.

New Update
TDP Bhuma Akhila Priya: ‘రా.. కదలిరా..’ సభకు రావొద్దు.. ఏవి సుబ్బారెడ్డికి అఖిలప్రియ కండీషన్.!

TDP Bhuma Akhila Priya: ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డలో వైసీపీ ఎమ్మెల్యే మళ్లీ రౌడీయిజం గుండా ఇజం తెరమీదకు తెస్తున్నారని విమర్శలు గుప్పించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. దౌర్జన్యం, దోపిడి తప్ప ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డికి రాజకీయమే తెలియదని కామెంట్స్ చేశారు.  గంగుల ప్రతాప్ రెడ్డి ని చూసి రాజకీయం నేర్చుకోవాలని ఎమ్మెల్యేకు సూచించారు.

Also Read: హద్దులు చెరిపేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. హాట్ పిక్స్ తో హల్‌చల్.!

ఇప్పటివరకు మీ ఇంట్లో ఆడవాళ్లు అవినీతి, అరాచకాలు చేస్తున్న ఎవరి విషయాలు బయట పెట్టలేదన్నారు. మీ ఇంట్లో ఆడవాళ్ళ పేర్లు ఆధారాలతో సహా బయట పెట్టమంటారా? అని ఎమ్మెల్యేని ప్రశ్నించారు. మీరు చేసే అరాచకాలు కాల్ రికార్డింగ్ తో సహా అందరి జాతకాలు తొందర్లోనే బయటపెడతానన్నారు. తప్పు చేయని నేను గట్టిగా ఉన్నాను తప్పు చేసిన మీరు ఎలా బయట తిరుగుతారో నేను చూస్తా అంటూ కామెంట్స్ చేశారు. టికెట్టు కోసం సొంత తండ్రికి టికెట్ వద్దని ఎమ్మెల్యే తిరుగుతున్నాడని వ్యాఖ్యనించారు.

Also read: సీఎం జగన్‌తో అంబటి రాయుడు భేటీ.. ఆ సీటు కన్ఫామ్ అయినట్లేనా?!

'ప్రజలకు, పోలీసులకు, మీడియాకు ఎంత భయం పెట్టుకుంటారో పెట్టుకోండి.. ఒక్కసారి తిరుగుబాటు తనం ఏర్పడితే తర్వాత మీ గతి ఏంటో చూసుకోండి.. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత వాళ్లకి ఇస్తాం. ముఖ్యంగా మీడియాకు.. పోలీసులకు.. నీతి నిజాయితీగా పనిచేసుకునే స్వేచ్ఛను ఇస్తాం' అంటూ వ్యాఖ్యనించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు