WAR 2 Movie : ఎన్టీఆర్‌, హృతిక్‌ .. 'వార్ 2' లో అదిరిపోయే సాంగ్

జూనియర్ ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్ లీడ్ రోల్స్ లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ వార్ 2. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెర పైకి వచ్చింది. ఎన్టీఆర్‌, హృతిక్‌ కాంబోలో స్పెషల్ సాంగ్ డిజైన్ చేశారట డైరెక్టర్ అయాన్‌. ఈ పాట నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని టాక్.

New Update
WAR 2 Movie : ఎన్టీఆర్‌, హృతిక్‌ .. 'వార్ 2' లో అదిరిపోయే సాంగ్

WAR 2 : టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr. NTR), ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు కొరటాల శివ దర్శకత్వంలో దేవర చేస్తూనే.. మరో వైపు వార్ 2 చిత్రీకరకు సిద్దమైపోయారు యంగ్ టైగర్.

వార్ 2 మూవీ

ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ వార్ 2. తారక్ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు . స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే వార్ 2 షూట్ కోసం తారక్ ముంబై వెళ్లిన విజువల్స్ సోషల్ మీడియా వైరలవుతున్న సంగతి తెలిసిందే.

హృతిక్, తారక్ కాంబోలో స్పెషల్ సాంగ్
అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తుంది. వార్ 2 లో తారక్, హృతిక్ కాంబోలో ఓ స్పెషల్ మాస్ సాంగ్ ప్లాన్ చేశారట డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. వరల్డ్ క్లాస్ విజువల్స్ తో ఈ సాంగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతే కాదు ఈ పాటకు సంబంధించిన షూట్ యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ స్టూడియోలో 10 రోజుల పాటు కొనసాగనుందట.

Also Read: Jr NTR: ఎన్టీఆర్ వార్ మొదలెట్టేశాడు..10 రోజులు అక్కడే!

Advertisment
Advertisment
తాజా కథనాలు