ట్రాన్స్‌ జెండర్‌ గా అదరగొట్టిన సుస్మితా సేన్‌!

ఇది ఒక ట్రాన్స్‌ జెండర్‌ కథ. దీనిలో మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ ట్రాన్స్‌ జెండర్‌ గా నటించింది. ఈ సినిమా ఆగస్ట్‌ 15 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ అవ్వనుంది.

New Update
ట్రాన్స్‌ జెండర్‌ గా అదరగొట్టిన సుస్మితా సేన్‌!

ఓటీటీలు వచ్చాక వెబ్‌ సిరీస్‌ లు చూసేవారి సంఖ్య బాగా పెరిగింది. భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల వెబ్‌ సిరీస్‌ లు చూసేస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఓటీటీ ప్లాట్ ఫామ్‌ లు కూడా కొత్తకొత్త కథలతో వెబ్ సిరీస్‌ లు తీసుకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే జాతీయ దర్శకుడు రవి జాదవ్‌ తెరకెక్కించిన కొత్త వెబ్‌ సిరీస్‌ తాళి.

ఇది ఒక ట్రాన్స్‌ జెండర్‌ కథ. దీనిలో మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ ట్రాన్స్‌ జెండర్‌ గా నటించింది. ఈ సినిమా ఆగస్ట్‌ 15 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ అవ్వనుంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ ను సోమవారం విడుదల చేశారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా దీన్ని రూపొందించినట్లు దర్శకుడు చెబుతున్నారు.

ఈ సిరీస్ లో సుస్మితా గెటప్ చాలా ఆసక్తిగా ఉంది. ట్రాన్స్ జెండర్ల హక్కుల పోరాటం నేపథ్యంలో ఈ వెబ్‌ సిరీస్ కథ ఉండనుంది. నా దగ్గరకు మొదట ఈ కథ వచ్చినప్పుడు మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నట్లు సుస్మితా చెబుతుంది. కథకు తగినట్లుగా తనను తాను ట్రాన్స్ ఫర్‌ చేసుకోవడానికి సుమారు 6 నెలల సమయం పట్టినట్లు ఆమె వివరించింది.

ట్రాన్స్ జెండర్ల హక్కుల కోసం పోరాటం చేసిన శ్రీగౌరీ సావంత్ చాలా గౌరవనీయమైన వ్యక్తి. ఆమె కథే తాళి. ఈ సిరీస్ ని నిర్మించడానికి కొన్ని రోజుల ముందు ఆమెతో కలిసి ట్రావెల్ చేశాను. ఆ రోజులు చాలా అదృష్టంగా భావిస్తున్నానని సుస్మితా సేన్‌ వివరించింది. నా నిజ జీవిత పాత్రలో సుస్మితా సేన్ చాలా బాగా యాక్ట్‌ చేశారని గౌరీ సావంత్‌ చెప్పారు.

నా కథను ఒక వెబ్ సిరీస్‌ గా తీయడం ఆనందం కలిగించిందని సంతోషం వ్యక్తం చేశారు. తాళి వెబ్ సీరీస్ ట్రాన్స్ జెండర్ల పట్ల అందరూ వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తుంది. దీనివల్ల కొంతలో కొంత అయినా ప్రజల్లో మార్పు వస్తుందని సీరీస్ టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

‘తాళి’ ఫస్ట్ లుక్ పోస్టర్ పై విమర్శలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాల గురించి సుస్మిత తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. “సోషల్ యాక్టివిస్ట్, ట్రాన్స్‌ జెండర్‌ శ్రీగౌరి సావంత్‌ జీవిత కథ ఆధారంగా ‘తాళి’ సిరీస్ ను తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రంలో నేను మెయిన్ రోల్ పోషిస్తున్నాను.

ఈ సిరీస్ కు సంబంధించి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను ఇన్‌ స్టాలో రిలీజ్ చేసినప్పుడు చాలా మంది నెటిజన్లు నా గురించి మాట్లాడారు. అసభ్యంగా కామెంట్స్ పెట్టారు. వాటిని చూసి షాక్ అయ్యాను. ఇతరుల గురించి ఇంత చెత్తగా ఎలా మాట్లాడుతున్నారు? అనుకున్నాను. సభ్యత లేని వారిని బ్లాక్ చేశాను” అని తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ప్రవస్తి ఆరోపణలు.. పాటతో కౌంటర్ ఇచ్చిన సింగర్ సునీత

సింగర్ సునీత ఇన్‌డైరెక్ట్‌గా ప్రవస్తిని ఉద్దేశించి ఓ పోస్ట్ చేశారు. గోపీచంద్‌ నటించిన 'ఒక్కడున్నాడు' మూవీలో కీరవాణి సంగీతం అందించిన 'అడుగడుగున పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు అనే పాటను షేర్ చేశారు. ప్రవస్తి గురించే ఈ పాటను షేర్ చేశారని నెటిజన్లు అంటున్నారు.

New Update
singer pravasthi comments on Sunitha

singer pravasthi comments on Sunitha

గాయని ప్రవస్తి పాడుతా తీయగా షోలోని జడ్జిలపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వారికి నచ్చిన వారికే ప్రోగ్రాంలో ఎంకరేజ్ చేస్తారని మిగతా వారిని తొక్కేస్తారని సింగర్ ప్రవస్తి కామెంట్లు చేసింది. అలాగే తనని బాడీ షేమింగ్ చేశారని తెలిపింది. అయితే దీనికి సింగర్ సునీత స్పందిస్తూ.. ఓ వీడియోను విడుదల చేశారు. ఆ తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ప్రవస్తి కూడా సునీత కోసం వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

కీరవాణి అందించిన పాటను..

ఈ క్రమంలో సింగర్ సునీత మరో వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ప్రవస్తి గురించి డైరెక్ట్‌గా కాకుండా.. లిరిక్స్‌ను షేర్ చేశారు. గోపీచంద్‌ నటించిన 'ఒక్కడున్నాడు' మూవీలో కీరవాణి సంగీతం అందించిన పాటను ఆమెను షేర్ చేశారు. 'అడుగడుగున పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు.. కోరిన తీరాన్నే చేరుకునే వరకు ఓ నిమిషమైనా నిదరపోవా..' అనే లిరిక్స్‌ పాటను షేర్ చేశారు. అయితే సునతీ సింగర్ ప్రవస్తి గురించే పాటను షేర్ చేశారని నెటిజన్లు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

ఇదిలా ఉండగా పాడుతా తీయగా ప్రోగ్రామ్‌లో చాలా మంది సింగర్లు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. అయితే ఈ షోలో జడ్జెస్‌గా సునీత, కీరవాణి, చంద్రబోస్‌లపై గాయని ప్రవస్తి ఆరోపణలు చేసింది. జడ్జిమెంట్‌ విషయంలో వివక్ష చూపుతున్నారని, కొందరు పాడకపోయినా కూడా సపోర్ట్ చేస్తూ.. చివరి వరకు తీసుకువచ్చారని తెలిపింది. దీనిపై సింగర్ సునీత కూడా క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా పలుమార్లు విమర్శలు చేయడంతో ఈ వీడియోను షేర్ చేశారు. 

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

Advertisment
Advertisment
Advertisment