YSRCP : కర్నూలు వైసీపీలో భగ్గుమన్న విభేదాలు
కర్నూలలో ఈ రోజు జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి వర్గీయుల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో మరో సారి వర్గ విభేదాలు బయటపడ్డాయి.
కర్నూలలో ఈ రోజు జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి వర్గీయుల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో మరో సారి వర్గ విభేదాలు బయటపడ్డాయి.
టీడీపీ ఛీఫ్ చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల్లో జగన్ సర్కార్ కూలిపోవడం ఖాయమని అన్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఎవరు ఆ వైసీపీ ఎమ్మెల్యేలు అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.
వ్యక్తిగత కారణాలతోనే ఎమ్మెల్యే పదవికి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. బాధగా ఉన్నప్పటికీ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అవకాశం కల్పించిన జగన్ కు ధన్యవాదాలు తెలిపారు ఆర్కే.
వైసీపీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేయడం ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. తనను కాదని నియోజకవర్గ ఇంఛార్జిగా గంజి చిరంజీవిని నియమించనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతుందని అన్నారు ఏపీ కాంగ్రెస్ ఛీఫ్ గిడుగు రుద్రరాజు. త్వరలో ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల రాబోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఏపీలో షర్మిలతో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని అన్నారు.
తిరుపతి జిల్లాలో పొటాటో అంటే ఉల్లిగడ్డే కదా? అంటూ సీఎం జగన్ సందేహపడటంపై టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్లు వేశారు. జగన్కు బంగాళ దుంపలకు, ఉల్లిగడ్డలకు తేడా తెలియడం లేదని.. ఇలాంటి వ్యక్తికి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ఎన్నికలు రాజకీయ నేతల్లో టెన్షన్ పుట్టిస్తోంది. తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుందా? అని ఏపీలో ప్రధాన పార్టీల నేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని వైసీపీ, కాంగ్రెస్ పార్టీనే గెలవాలని టీడీపీ భావిస్తున్నాయని టాక్ వినిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఒకవైపు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని టీడీపీ వ్యూహాలు రచిస్తుంటే.. కీలక నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.