AP : రైతులకు పరిహారం ఇవ్వాలి.. తాడేపల్లి గూడెంలో షర్మిల వినూత్న నిరసన..!
పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి వినూత్నంగా నిరసన చేశారు. నందమూరు గ్రామంలో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని నడుంలోతు నీళ్లలో దిగి ఆందోళనకు దిగారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి వినూత్నంగా నిరసన చేశారు. నందమూరు గ్రామంలో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని నడుంలోతు నీళ్లలో దిగి ఆందోళనకు దిగారు.
బీజేపీ మన రాష్ట్రంపై చిన్న చూపు చూస్తోందన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. NDRF బలగాలను పూర్తి స్థాయిలో పంపలేదన్నారు. వినుకొండ వ్యక్తిగత హత్యను పొలిటికల్ మర్డర్ అని జగన్ కలరింగ్ ఇస్తున్నారన్నారు. అసెంబ్లీలో ఉండాల్సిన జగన్ ఢిల్లీ వెళ్ళడం ఏమిటని ప్రశ్నించారు.
AP: వినుకొండ హత్య ఘటనపై షర్మిల స్పందిచారు. ఇలాంటి ఘటన జరగడం దారుణమని అన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది రాజకీయ హత్య అయితే, కూటమి సర్కారుకు ఇదే హెచ్చరికని అన్నారు. ఇలాంటి దాడులు మీకు, రాష్ట్రానికి మంచిది కాదన్నారు.
ఏపీలో వైసీపీ నేతల తీరు పచ్చ కామర్లోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందనే సామెతలా ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. సాక్షి పత్రికలో తల్లికి వందనం కథనంపై ప్రశ్నించినందుకు కాంగ్రెస్ ను తోక పార్టీ అని కామెంట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని APCC చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని బీజేపీ పార్టీలేనన్నారు. బీజేపీ అంటే బాబు, పవన్, జగన్ అని అభివర్ణించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ స్పూర్తితోనే రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టారని సీఎం రేవంత్ అన్నారు. కడపలో ఉపఎన్నికలు వస్తే తానే బాధ్యత తీసుకుంటానన్నారు. వైఎస్సార్ ఆశయాలను తుంగలో తొక్కారంటూ వైఎస్ షర్మిలా పరోక్షంగా జగన్‌ను విమర్శించారు.
AP: ప్రధాని మోదీపై షర్మిల ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌ను అబద్దాల కార్ఖానాగా నడుపుతున్నారని ధ్వజమెత్తారు. మోదీ చేసే నీచ రాజకీయాలు, మోసపూరిత చర్యలు, ప్రజల గుండెల్లో విషం నింపే కుట్రపూరిత కోరలు, ఇవన్నీ యావత్ దేశం గమనిస్తోందని అన్నారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్‌ని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆయన నివాసంలో కలిశారు. ఈ నెల 8న విజయవాడలో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ 75 జయంతి వేడుకలకు హజరవ్వాలని కోరారు. అదే విధంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.
పోలవరం విధ్వంసానికి బీజేపీ, టీడీపీ, వైసీపీ పార్టీలే కారణమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. రూ.10 వేల కోట్ల ఖర్చయ్యే ప్రాజెక్టును రూ.76వేల కోట్లకు తీసుకెళ్లారని.. ప్రాజెక్టు పూర్తికి చంద్రబాబు మరో ఐదేళ్లు పడుతుందని చెప్పడం సరికాదని ధ్వజమెత్తారు.